AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eureka Forbs Sale: ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫయర్స్ తయారుచేసే యూరేకా ఫోర్బ్స్ కంపెనీ అమ్మేస్తున్నారు!

వాటర్ ప్యూరిఫయర్స్ తాయారు చేసే  యురేకా ఫోర్బ్స్ ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఈ కంపెనీని అమెరికన్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తుంది .

Eureka Forbs Sale: ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫయర్స్ తయారుచేసే యూరేకా ఫోర్బ్స్ కంపెనీ అమ్మేస్తున్నారు!
Aquaguard For Sale
KVD Varma
|

Updated on: Sep 10, 2021 | 9:55 PM

Share

Eureka Forbs Sale: వాటర్ ప్యూరిఫయర్స్ తాయారు చేసే  యురేకా ఫోర్బ్స్ ఇప్పుడు అమ్మకానికి ఉంది. ఈ కంపెనీని అమెరికన్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తుంది . ఫోర్బ్స్ షాపూర్జీ పాలోంజీ గ్రూప్ (SP గ్రూప్)  17 కంపెనీలలో యురేకా ఒకటి. ఈ డీల్ విలువ దాదాపు రూ .5,000 కోట్లు ఉంటుందని అంచనా. SP గ్రూప్ సైరస్ మిస్త్రీ ఒకప్పుడు టాటా గ్రూప్ ఛైర్మన్. రతన్ టాటాతో అతని వైరం అందరికీ తెలిసిందే. 

యురేకా ఫోర్బ్స్ వాటర్ ప్యూరిఫైయర్‌లతో పాటు వాక్యూమ్ క్లీనర్‌లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం కోసం SP గ్రూప్ స్టాండర్డ్ చార్టర్డ్ గ్రూప్‌ను ఎంచుకుంది. ఫోర్బ్స్ విలీనం తరువాత యురేకా ఫోర్బ్స్ కంపెనీ ఏర్పడుతుంది మరియు NCLT (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) నుండి అనుమతి కోసం కంపెనీ వేచి ఉంది. విలీనం ఆమోదం పొందిన తర్వాత, కంపెనీ అడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు విక్రయిస్తారు. యురేకా ఫోర్బ్స్ 1982 లో స్థాపించారు. SP గ్రూపులోని 17 కంపెనీలలో ఒకటి.

ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫయర్ అదే కంపెనీకి చెందినది

కంపెనీలో ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్, యూరోక్లియన్ వాక్యూమ్ క్లీనర్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. కంపెనీకి ప్రస్తుతం 35 దేశాలలో 20 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 2,857 కోట్లు.

20,000 కోట్ల భారీ రుణ భారం

 షాపూర్జీ పాలోంజీ గ్రూప్ భారీ రుణ భారాన్ని కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్‌లోని నివేదిక ప్రకారం, ఈ గ్రూపుకు దాదాపు రూ .20,000 కోట్ల అప్పు ఉంది. అటువంటి పరిస్థితిలో, కంపెనీ తన రుణాన్ని తగ్గించి నిర్మాణ వ్యాపారంపై దృష్టి పెట్టాలని కోరుకుంటుంది. నివేదిక ప్రకారం, మొత్తం రూ .20,000 కోట్ల రుణంలో రూ .12,000 కోట్లు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ కోవిడ్ రిలీఫ్ స్కీమ్ కింద వర్తిస్తాయి. దీని కింద, కంపెనీ దీనిని 2023 నాటికి పూర్తి చేయాలనుకుంటుంది. అయితే, రాబోయే కొద్ది నెలల్లో సగం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే యురేకా ఫోర్బ్స్ పెట్టుబడిని తీసివేస్తోంది.

ఇంకా చాలా కంపెనీలు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి

యురేకా ఫోర్బ్స్‌తో పాటు, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ స్టెర్లింగ్ మరియు విల్సన్ సోలార్, ఆఫ్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు మరికొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడి సంస్థ వార్‌బర్గ్ పిన్‌కస్ మరియు స్వీడిష్ గృహోపకరణాల తయారీదారు ఎలెక్ట్రోలక్స్ కూడా యురేకా ఫోర్బ్స్ కొనుగోలు కోసం పోటీ పడుతున్నాయి. (ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫయర్ అమ్మబడుతుంది, ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది)