Apple: ప్రపంచంలోనే అత్యధిక లాభాల సంస్థల్లో యాపిల్‌.. సెకనుకు రూ.1.5 లక్షల లాభం

లాభాల బాటలో పలు కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ రంగంలో అత్యధిక లాభాలు పొందుతున్న పలు కంపెనీలు. ఇక ఐఫోన్‌..

Apple: ప్రపంచంలోనే అత్యధిక లాభాల సంస్థల్లో యాపిల్‌.. సెకనుకు రూ.1.5 లక్షల లాభం
Apple
Follow us

|

Updated on: Nov 25, 2022 | 10:33 AM

లాభాల బాటలో పలు కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా మొబైల్‌ రంగంలో అత్యధిక లాభాలు పొందుతున్న పలు కంపెనీలు. ఇక ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ లాభాల బాటలో దూపుకుపోతోంది. ఈ సంస్థ సెకనుకు రూ.1.48 లక్షల (1,820 లాభాన్ని ఆర్జిస్తోందని నివేదికలు వెల్లడవుతున్నాయి. అంటే ఈ సంస్థ రోజుకు వచ్చే లాభం సుమారు రూ.1,282 కోట్లు (157 మిలియన్‌ డాలర్లు). ప్రపంచంలోనే అత్యధిక లాభాల్లో నడిచే సంస్థల్లో యాపిల్‌దే మొదటిస్థానమని ఓ పరిశోధన నివేదిక స్పష్టం చేసింది.

అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను తయారు చేసింది. ఇక మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌ ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, బెర్క్‌షైర్‌ హాథ్‌వే కూడా భారీగానే లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇవి సెకనుకు 1000 డాలర్లకు పైగానే ఆర్జిస్తున్నాయట ఈ కంపెనీలు రోజువారీగా చూస్తే 100 మిలియన్‌ డాలర్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌ లాభం సెకనుకు రూ.1.14 లక్షలు (1404 డాలర్లు), ఇక బెర్క్‌షైర్‌ హాథ్‌వే రూ.1.10 లక్షల (1,348 డాలర్లు) లాభాన్ని పొందుతున్నాయి. ఇవి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక నాలుగో స్థానంలో ఆల్ఫాబెట్‌ (సెకనుకు 1,277 డాలర్లు), ఐదో స్థానంలో మెటా (924 డాలర్లు) ఉంది.

మరోవైపు ఉబర్‌ టెక్నాలజీస్‌ నష్టాల బాటలో ఉంది. ఈ సంస్థ సెకనుకు 215 డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరిశోధనా నివేదికలు చెబుతున్నాయి. ఈ కంపెనీ ఎప్పుడు కూడా లాభాలను ఆర్జించలేదు. ఇక జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంవత్సరానికి 10.68 బిలియన్‌ డాలర్ల లాభాల్లో ఉంది. మెటా ప్లాట్‌ఫారమ్‌లు 10.86 బిలియన్ల లాభంతో వెనుకబడి ఉన్నాయని పరిశోధనా తెలిపింది. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ 2020లో సాధించిన దానికంటే 2021లో 9.74 బిలియన్‌ డాలర్లు అధికంగా సంపాదించి లాభాలలో పయనిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో