AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి లోకేష్ భేటీ

ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు.

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి లోకేష్ భేటీ
Ap Minister Nara Lokesh Meets Airbus Board
Balaraju Goud
|

Updated on: Sep 30, 2025 | 7:05 PM

Share

ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఎయిర్ బస్ ఛైర్మన్ రెనీ ఒబెర్మన్ తోపాటు ఎయిర్ బస్ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

మేకిన్ ఇండియా, స్వదేశీకరణ అవకాశాల అన్వేషణలో భాగంగా ఎయిర్ బస్ బోర్డ్ మొదటిసారి భారతదేశానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్ బస్ ఆధారిత ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని మంత్రి లోకేష్ వివరించారు. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీతో పాటు దీనికి అనుబంధంగా టైర్-1, టైర్-2 సరఫరాదారుల సహ ఉత్పత్తి యూనిట్ల రూపంలో కలిసి పనిచేసేలా ప్రతిపాదనను మంత్రి లోకేష్ వారి ముందుంచారు. ఏపీలో ఇప్పటికే అందుబాటులో ఉన్న భూమి లభ్యతతో పాటు ప్రాజెక్ట్ వేగంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరో స్పేస్ పాలసీని వివరించారు. తద్వారా రాష్ట్రాన్ని ఎగుమతి ఆధారిత ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

ప్రధాన యూనిట్ తోపాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ ఎయిర్ బస్ ను కోరారు. దీనివల్ల టైమ్ లైన్ రిస్క్ లు తగ్గడంతో పాటు లోకలైజేషన్ పెరిగి తక్కువ ఖర్చుతో విస్తృతస్థాయిలో తయారీ సాధ్యం అవుతుందని వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఏరోస్పేస్ కారిడార్ లలో అనేక సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని, అవి ఎయిర్ బస్ ప్రోగ్రామ్ అవసరాలకు, సరఫరాదారుల క్లస్టరింగ్, రవాణ సౌకర్యాలు, భవిష్యత్ విస్తరణలకు అనుగుణంగా ఉంటాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల ప్రాధాన్య విధానాన్ని, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్ధిష్ట గడువులోగా ప్రాజెక్ట్ అమలు వంటి అంశాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్, ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డ్ ను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఎయిర్ బస్ రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..