Anand Rathi: నేటితో ముగియనున్న ఆనందర్ రాఠీ ఐపీఓ.. 14న లిస్టింగ్..

ముంబైకి చెందిన ఆర్థిక సేవల కంపెనీ ఆనంద్ రాఠీలో భాగమైన ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్, గత వారం డిసెంబర్ 3న ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ని ప్రారంభమైంది. ఈ ఐపీవో సోమవారంతో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.530-550గా నిర్ణయించారు...

Anand Rathi: నేటితో ముగియనున్న ఆనందర్ రాఠీ ఐపీఓ.. 14న లిస్టింగ్..
Ipo
Follow us

|

Updated on: Dec 06, 2021 | 10:42 AM

ముంబైకి చెందిన ఆర్థిక సేవల కంపెనీ ఆనంద్ రాఠీలో భాగమైన ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్, గత వారం డిసెంబర్ 3న ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ని ప్రారంభమైంది. ఈ ఐపీవో సోమవారంతో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.530-550గా నిర్ణయించారు. కంపెనీ తన IPO కంటే ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.194 కోట్లను సేకరించింది. 2వ రోజు నాటికి, ఆనంద్ రాఠీ వెల్త్ IPO 3 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ కేటగిరీ 4.77 సార్లు ఓవర్‌బుక్ చేశారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 3.06 సార్లు, QIBలు 17% వేలం వేశారు.

కంపెనీ ఈక్విటీ షేర్లు డిసెంబర్ 14న BSE, NSEలలో లిస్ట్ కానున్నాయి. ఆనంద్ రాఠీ వెల్త్ మ్యూచువల్ ఫండ్ పంపిణీ ఫైనాన్షియల్ ఉత్పత్తుల విక్రయంపై దృష్టి సారించి ఆర్థిక సేవల పరిశ్రమలో పనిచేస్తుంది. కంపెనీ 2002 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదారులు 1.2 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద కొనుగోలు చేశారు. ఈక్విరస్ క్యాపిటల్, BNP పారిబాస్, IIFL సెక్యూరిటీస్ మరియు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ ఈ ఆఫర్‌కు మేనేజర్‌లుగా ఉన్నారు.

Read Also… Post Office Returns: ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాంక్‎లో బెటరా.. పోస్ట్ ఆఫీస్‎లో బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ..