Stoke Park Hotel: లండన్‌లో సెలబ్రేషన్స్‌కు అంబానీ ఫ్యామిలీ రెడీ..? అసలు విషయం ఏంటంటే..?
ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీతో రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు దేశంలోనే ముఖేష్ అంబానీ చేసినట్లు వివాహ వేడుకలు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. అయితే దేశంలో వివాహ వేడుకల అనంతరం కేవలం అంబానీ ఫ్యామిలీ మాత్రమే లండన్‌లో ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటుందనే వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లండన్‌లోకి స్టోక్ పార్క్ హోటల్‌లో ఈ వేడుకలు చేసుకుంటున్నారని, ఈ మేరకు హోటల్‌ను రెండు నెలల పాటు బుక్ చేసేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీతో రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు దేశంలోనే ముఖేష్ అంబానీ చేసినట్లు వివాహ వేడుకలు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి కాదు. అయితే దేశంలో వివాహ వేడుకల అనంతరం కేవలం అంబానీ ఫ్యామిలీ మాత్రమే లండన్‌లో ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటుందనే వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లండన్‌లోకి స్టోక్ పార్క్ హోటల్‌లో ఈ వేడుకలు చేసుకుంటున్నారని, ఈ మేరకు హోటల్‌ను రెండు నెలల పాటు బుక్ చేసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ హోటల్ ప్రత్యేకతలు ఏంటి? నిజంగా అంబానీ ఫ్యామిలీ ఆ హోటల్‌కు వెళ్తున్నారా? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
లగ్జరీకి చిహ్నమైన స్టోక్ పార్క్ సెవెన్ స్టార్ హోటల్‌ను అంబానీ ఫ్యామిలీ రెండు నెలల పాటు బుక్ చేసుకుందనే వార్తల నేపథ్యంలో హోటల్ యాజమాన్యం స్పందించింది. స్టోక్ పార్క్‌లో సాధారణంగా ప్రైవేట్ విషయాలపై ప్రకటనలు జారీ చేయమని, కానీ ఇటీవలి మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండటానికి ప్రకటన విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. తమ హోటల్‌ను ఎవరూ రెండు నెలల పాటు బుక్ చేసుకోలేదని వివరించింది. స్టోక్ పార్క్ ఏ హోటల్‌కు సాటి రాదు. లండన్ చరిత్రలో ఆ హోటల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ హోటల్ ఒకప్పుడు క్వీన్ ఎలిజబెత్‌కు సంబంధించిన రాజ కుటుంబానికి చెందినదిగా చెబుతూ ఉంటారు.
ఈ ఎస్టేట్‌ను వాస్తవానికి ఇంగ్లండ్‌లోని మొదటి లార్డ్ చీఫ్ జస్టిస్ అయిన సర్ ఎడ్వర్డ్ కోక్ కొనుగోలు చేశారు. తర్వాత 1760లో అమెరికన్ పైన్ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ ఆస్తి శతాబ్దాలుగా మారిపోయింది. అనంతరం బ్రిటిష్ రాజకుటుంబం 1988లో కొనుగోలు చేసి మార్చింది. 300 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఎస్టేట్‌లో 49 విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, 27 గోల్ఫ్ కోర్స్‌లు, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ ఉన్నాయి. ఇందులో 4,000-చదరపు అడుగుల వ్యాయామశాల, మూడు రెస్టారెంట్లు, బార్‌లు, లాంజ్‌లు, స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అవుట్‌డోర్ హాట్ టబ్‌ని కలిగి ఉంది. ఈ హోటల్‌లోనే జేమ్స్ బాండ్ సిరీస్‌లోని సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి