Amazon Great Freedom Festival: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. వేటిపై అంటే..!
Amazon Great Freedom Festival: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి...
Amazon Great Freedom Festival: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. పద్రాగస్టును పురస్కరించుకుని అమెజాన్ ఆఫర్లను ముందుకు వచ్చింది. అమెజాన్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది. అయితే జూలైలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే.. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో గాడ్జెట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ సేల్ సందర్భంగా వినియోగదారులకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జతకట్టింది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు ద్వారా సేల్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక అమెజాన్ సేల్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను లభిస్తుంది.
ఇక రూ.79,900విలువైన ఆపిల్ ఐఫోన్ 12ను ఈ ఆఫర్ లో 11,901 తగ్గింపుతో లభిస్తుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎక్సేంజ్ ఆఫర్‌లో రూ.13,400 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. వీటితో పాటు వన్ ప్లస్ 9జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఈ సేల్‌లో ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు, ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై డిస్కౌంట్ పొందవచ్చు.