Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Offers: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. రెండు టెలికం సంస్థల స్పెషల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌

దీంతో టెలికం సంస్థలు తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఇదే ఓటీటీని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు ఓటీటీ సేవలతో కూడిన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రముఖ టెలికం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ ముందు వరుసలో ఉంటున్నాయి. కాంబో ప్యాకేజీల పేరుతో కాల్స్‌, డేటాతోపాటు...

Recharge Offers: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. రెండు టెలికం సంస్థల స్పెషల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌
Recharge Plans
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 04, 2024 | 8:26 AM

కరోనా తర్వాత ఓటీటీ సేవలకు ఆదరణ భారీగా పెరిగింది. కరోనా సమయంలో థియేటర్లు సైతం మూతపడడంతో ఇంట్లోనే సినిమాలు చేసే ట్రెండ్ పెరిగింది. దీంతో చాలా మంది ఓటీటీ సేవలకు మొగ్గుచూపారు. ఇక బడా సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఓటీటీలకు అట్రాక్ట్ అయ్యారు. ఇక కరోనా పరిస్థితులు సద్దుమనిగి, థియేటర్లు తిరిగి ఓపెన్‌ అయిన తర్వాత కూడా ఓటీటీల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది.

దీంతో టెలికం సంస్థలు తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఇదే ఓటీటీని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు ఓటీటీ సేవలతో కూడిన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రముఖ టెలికం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌ ముందు వరుసలో ఉంటున్నాయి. కాంబో ప్యాకేజీల పేరుతో కాల్స్‌, డేటాతోపాటు ఓటీటీ సేవలను సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్, జియోలు నెట్‌ఫ్లిక్స్‌ సేవలను ఉచితంగా అందిస్తూ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ ప్లాన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియో రీఛార్జ్‌ ప్లాన్‌..

రిలయన్స్‌ జియో రూ. 1499తో రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. దీంతో రీఛార్జ్‌ చేసుకున్న వారికి 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌తో పాటు రోజుకు 3 జీబీ డేటా పొందొచ్చు. ఇక ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచచు. ఇక రూ. 1099తో రీఛార్జ్‌ చేసుకుందే.. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు, 2 జీబీ రోజువారీ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. వీటితో పాటు అదనంగా.. జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు, జియో టీవీ, జియో సినిమా ఉచితం.

ఎయిర్‌ టెల్ ప్లాన్‌..

ఇక ఎయిర్ టెల్‌ విషయానికొస్తే.. రూ. 1499 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ఉచిత హలో ట్యూన్స్, 3 నెలల అపోలో 24/7, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, వింక్ మ్యూజిక్ లో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..