AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Insurance: ఆ బాధ్యత వారిదే.. విమాన ప్రమాదాల్లో బీమా పరిధిపై కీలక అప్‌డేట్

గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టింది. 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ ప్రమాదం ప్రయాణీకుల భద్రతతో పాటు ఇలాంటి విపత్తుల ఆర్థిక పరిణామాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

Travel Insurance: ఆ బాధ్యత వారిదే.. విమాన ప్రమాదాల్లో బీమా పరిధిపై కీలక అప్‌డేట్
Plane Crash
Nikhil
|

Updated on: Jun 13, 2025 | 1:44 PM

Share

గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో బోయింగ్ విమానం కూలిపోయింది. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు ప్రయాణ బీమా గురించి ఆలోచిస్తున్నారు. అయితే భారతదేశంలో విమాన ప్రమాదం కారణంగా మరణం లేదా గాయం సంభవించినప్పుడు విమానయాన సంస్థలు చెల్లించాల్సిన బాధ్యతలు భారతదేశం సైన్ చేసిన 1999 మాంట్రియల్ కన్వెన్షన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా నిర్వహిస్తారు. నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత విమానయాన సంస్థలదేనని నిబంధనలు చెబుతున్నాయి. ఏదైనా తప్పు జరిగినా, మరణం లేదా శారీరక గాయం సంభవించినా, ఒక్కో ప్రయాణీకుడికి ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు సుమారు రూ. 1.55 కోట్లు చెల్లించాలి. అయితే విమానయాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రుజువైతే ఆ పరిమితికి మించి పరిహారం కూడా సాధ్యమే.

అంతర్జాతీయ విమానాలకు ఈ పరిహారం కన్వెన్షన్ ప్రకారం తప్పనిసరి అవుతుంది. కానీ భారతీయ దేశీయ విమానయాన సంస్థలు తరచుగా డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి ప్రమాణాలను అనుసరిస్తాయి. అయితే ప్రయాణీకుడు అందుకునే వాస్తవ మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హక్కుదారుడు (మరణించిన ప్రయాణీకుడు లేదా గాయపడిన వ్యక్తి కుటుంబం) జరిగిన వాస్తవ నష్టానికి సంబంధించిన పరిధిని నిరూపించాలి. మరణించిన ప్రయాణికుడి వయస్సు, విద్యా స్థితి, ఉద్యోగం, చివరిగా తీసుకున్న జీతం, వైవాహిక స్థితి, సాధారణ ఆర్థిక స్థితి, ఆధారపడిన వారి సంఖ్య, వారిపై ఆధారపడిన వారి సంఖ్య వంటి అంశాలను సాధారణంగా పరిగణనలోకి తీసుకుని నష్టాన్ని అంచనా వేస్తారు.

ప్రయాణ బీమా ఇలా 

ప్రయాణ ప్రయాణీకులకు & కుటుంబాలకు ఎలా సహాయపడుతుంది. ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం, వైద్య ఖర్చులు, అత్యవసర ఆసుపత్రిలో చేరడం, విమాన ఆలస్యం/రద్దు, సామగ్రి కోల్పోవడం వంటి అనేక సమగ్ర ప్రయాణ బీమా పాలసీలు వీటిని అందిస్తాయి. వీటిల్లో ప్రమాదవశాత్తు మరణ కవరేజ్‌లో రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఉంటుంది. శాశ్వత వైకల్యానికి రూ. 5-రూ. 10 లక్షలు. ఆసుపత్రిలో చేరడం లేదా ప్రయాణ అసౌకర్యానికి స్థిరమైన రోజువారీ చెల్లింపులు ఉంటాయి. అయితే ఈ ప్రయోజనం విమాన ప్రయాణానికి ముందు ప్రయాణ బీమా పథకాన్ని చురుకుగా ఎంచుకుని కొనుగోలు చేసే పాలసీదారులకు మాత్రమే చెందుతుంది. చాలా మంది భారతీయ విమాన ప్రయాణికులు ఇప్పటికీ ఈ ఎంపికను విస్మరిస్తారు. ముఖ్యంగా దేశీయ విమానాల విషయంలో ఈ విషయాన్ని ప్రయాణికులు అస్సలు పట్టించుకోరు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి