AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioners: మీరు ఏసీ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి!

వేసవి కాలం కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఏసీలు కొంత ఖరీదు ఎక్కువైనా ఎండాకాలం నుంచి రక్షించుకునేందుకు..

Air Conditioners: మీరు ఏసీ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి!
Representative Image
Subhash Goud
|

Updated on: Apr 09, 2023 | 4:23 PM

Share

వేసవి కాలం కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఏసీలు కొంత ఖరీదు ఎక్కువైనా ఎండాకాలం నుంచి రక్షించుకునేందుకు కొనుగోలు చేస్తారు. మీరు కోసం కొత్త ఏసీని కొనుగోలు చేయబోతున్నట్లయితే కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. ఏసీలోని రకాలు, వాటి పని తీరు, ఎంత కరెంటు తీసుకుంటుంది.. ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి..? తదితర విషయాలను ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏసీలు అంటేనే కొంత ఖరీదైనవిగా ఉంటాయి. అందులో కరెంటు బిల్లు కూడా తడిసి మోసడవుతుంటుంది.

ఎందుకంటే వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ ఓ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. అయితే ఏసీని కొనే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మీకు ఎలాంటి, ఎంత కెపాసిటీ ఏసీ కావాల్సి ఉంటుందో తెలుసుకొని కొనుగోలు చేయాలి.

ఏసీల రకాలు:

ఇంట్లో వాడుకునే ఏసీలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. వాటి రకాల గురించి తెలిసి ఉండాలి. వాటిలో ఒకటి విండోస్, రెండోది స్ప్లిట్ ఏసీ. అటువంటి విండోస్ అతిపెద్ద లక్షణం ఏమిటంటే అవి చాలా పొదుపుగా ఉంటాయి. వాటిలో పరిమిత సంఖ్యలో స్మార్ట్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. వాటిని అమర్చడం సులభం.

ఇవి కూడా చదవండి

వేసవి మధ్యలో అంటే మే, జూన్, జూలైలలో నగరాల ఉష్ణోగ్రత 35-42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఎయిర్ కండీషనర్లు ఇంటిని చల్లబరచడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమనే చెప్పాలి.

ఏసీ తీసుకునే ముందు గది పరిమాణం చూసుకుని, ఆ తర్వాతే ఏసీ కెపాసిటీని నిర్ణయించుకోవాలి. వాస్తవానికి 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో 0.8 టన్ను ACని ఉపయోగించవచ్చు. అయితే 1500 చదరపు అడుగుల గదికి 1 టన్ను సామర్థ్యం కలిగిన ACని ఉపయోగించవచ్చు.

స్టార్ రేటింగ్ ముఖ్యం

ఎయిర్ కండీషనర్లకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ఇచ్చే రేటింగ్ చాలా ముఖ్యమైనది. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి. 1 నుంచి 5 స్టార్ రేటింగ్ వరకు ఏసీలు ఉంటాయి. 2 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీ తక్కువ విద్యుత్‍ను వాడుకుంటుంది. 5 స్టార్ రేటింగ్ ఏసీల వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఇన్‍బుల్ట్‌గా ఇన్వర్టర్ ఫీచర్ ఉండే ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి.

ఇటీవలి కాలంలో ఏసీలు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. వైఫై, వాయిస్ కంట్రోల్స్, స్మార్ట్ ఫోన్ నుంచి కంట్రోల్ చేసేలా యాప్ సపోర్ట్ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. ఏసీని కొనే ముందు ఫీచర్లను కూడా తెలుసుకోవాలి. ఎయిర్ కండీషనర్‌లోని భాగాలు ఏ మెటీరియల్‍తో తయారయ్యాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కండెన్సర్ కాయిల్.. కాపర్‌తో ఉండే ఏసీలు మెరుగ్గా పనిచేస్తాయి. అల్యూమినియమ్ కాయిల్‍లతో పోలిస్తే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలు మంచి పనితీరు కలిగి ఉంటాయని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి