AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: అదానీ గ్రూప్‌కు మేం ఆదుకుంటాం.. సహాయం అందించేందుకు రంగంలోకి దిగిన జపాన్ బ్యాంకులు..!

కొన్ని ప్రధాన బ్యాంకులు ఇప్పటికీ ఈ సమూహంపై విశ్వాసం కలిగి ఉండటం గమనార్హం. జపాన్‌తో సహా యూరోపియన్ యూనియన్ విశ్వాసాన్ని కూడా అదానీ గ్రూప్ నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు..

Adani Group: అదానీ గ్రూప్‌కు మేం ఆదుకుంటాం.. సహాయం అందించేందుకు రంగంలోకి దిగిన జపాన్ బ్యాంకులు..!
Adani
Sanjay Kasula
|

Updated on: May 09, 2023 | 1:50 PM

Share

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలతో అదానీ గ్రూప్ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు తర్వాత అదానీ గ్రూప్ పెట్టుబడిదారులు కంపెనీపై విశ్వాసం కోల్పోవడం ప్రారంభించారు. అయినప్పటికీ, కొన్ని ప్రధాన బ్యాంకులు ఇప్పటికీ ఈ సమూహంపై విశ్వాసం కలిగి ఉండటం గమనార్హం. జపాన్‌తో సహా యూరోపియన్ యూనియన్ విశ్వాసాన్ని కూడా అదానీ గ్రూప్ నిలుపుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బిజినెస్ మీడియా సంస్థల నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం, మిత్సుబిషి యుఎఫ్‌జె ఫైనాన్షియల్ గ్రూప్, సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్ అనే మూడు జపాన్ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు ఆర్థిక సహాయాన్ని అందజేస్తాయని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ మూడు బ్యాంకులు గతంలో అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు కాకపోవడం గమనార్హం. జపాన్ బ్యాంకుల నుంచి ఫైనాన్సింగ్ పొందడం వల్ల అదానీ గ్రూప్ ఆసియా, యూరప్‌లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి పడిపోయింది.

జపాన్‌లోని మూడు బ్యాంకులు 2024, 2026 ఆర్థిక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే బాండ్లను రీఫైనాన్స్ చేయడానికి.. ఇప్పటికే ఉన్న లేదా కొత్త రుణాలను జారీ చేయడానికి ఆఫర్ చేశాయి. అదానీ గ్రూప్ 2024 మరియు 2026 ఆర్థిక సంవత్సరాల్లో $4 బిలియన్ల విలువైన బాండ్లను కలిగి ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్), అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్‌లో రూ.15,446 కోట్ల పెట్టుబడితో.. అదానీ గ్రూప్ ప్రధాన పెట్టుబడిదారు GQG పార్టనర్స్ గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలలో మరింత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

అదానీ గ్రూప్ కంపెనీలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యుటిలిటీ రంగాలలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. నగదు ప్రవాహం అవసరం ఉంది. కొత్త గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం సుమారు 800 మిలియన్ డాలర్లు సేకరించేందుకు చర్చలు జరుపుతోంది. కంపెనీ తన సిమెంట్ వ్యాపారంలో సామర్థ్యాన్ని పెంచడంతోపాటు విస్తరణ ప్రణాళికలను కూడా పరిశీలిస్తోంది.

అదానీ గ్రూప్ ఇటీవలే అంబుజా సిమెంట్స్ మరియు ఏసీసీలను కొనుగోలు చేసింది. మార్చి 31, 2023 నాటికి అదానీ గ్రూప్ రుణం రూ. 2.27 ట్రిలియన్లు. అందులో 39 శాతం బాండ్లు, 29 శాతం అంతర్జాతీయ బ్యాంకులు మరియు 32 శాతం భారతీయ బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిల నుండి ఉన్నాయి. అలాగే గ్రూప్ మొత్తం ఆస్తుల విలువ 3.91 లక్షల కోట్ల రూపాయలు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం