Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వచ్చే వారంలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
వచ్చే వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. సంక్రాంతి సందర్బంగా బ్యాంకులు వరుసగా మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లు ముందుగానే అలర్ట్ అయి లావాదేవీలు జరుపుకోవాలి. బ్యాంకుల మూత వల్ల పలు సర్వీసులు ఆగిపోనున్నాయి. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. జనవరిలో వరుస సెలవులు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. సంక్రాంతితో పాటు వివేకానంద జయంతి లాంటి పండుగలు ఉండటంతో వచ్చే వారంలో బ్యాంకులు బంద్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల ప్రకారం వచ్చే వారంలో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. వీటి గురించి కస్టమర్లు ముందే తెలుసుకుని తమ బ్యాంకు లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. ఆర్బీఐ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థానిక పండుగలకు బ్యాంకులకు సెలవులు ప్రకటించవచ్చు. ఆర్బీఐ, స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే హాలీడేస్ ప్రకారం వచ్చే వారంలో బ్యాంకుల సెలవుల జాబితా ఒకసారి చూద్దాం.
వచ్చే వారంలో సెలవులు ఇలా..
-జనవరి 12 వివేకానంద జయంతి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో బ్యాంకులకు సెలవు
-జనవరి 14న సంక్రాంతి పండగ, మాఘ్ బిహు పండుగలను పురస్కరించుకుని గుజరాత్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోంలో బ్యాంకులకు సెలవు
-జనవరి 15న సంక్రాంతి సందర్బంగా ఏపీ, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, తమిళనాడులో బ్యాంకులు బంద్
-జనవరి 16న కనుమ సందర్భంగా ఏపీలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి
-జనవరి 16న తిరువళ్లువర్ దినోత్సవం సందర్బంగా తమిళనాడులో బ్యాంకులు పనిచేయవు
-జనవరి 17న ఉళవర్ తిరునాళ్ పురస్కరించుకుని తమిళనాడులో బ్యాంకులు క్లోజ్
-జనవరి 18న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు
సెలవు రోజు ఇవి పనిచేయవు
బ్యాంకులకు సెలవు రోజున చెక్కుల సర్వీసులు నిలిచిపోతాయి. చెక్కులు డిపాజిట్ చేయడం కుదరదు. ఇక ప్రామిసరీ నోటుకు సంబంధించిన లావాదేవీలు కూడా ఆగిపోతాయి. అయితే ఏటీఎం ద్వారా డబ్బులు డిపాజిట్, విత్ డ్రా, ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక మొబైల్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి.
