Safest Cars In India: మనదేశంలో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే.. క్రాష్ టెస్ట్‌లో సూపర్ రేటింగ్..
మన దేశంలో కార్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి అసెస్ మెంట్ ప్రోగ్రామ్ లేదు. అయితే యూకేకి చెందిన గ్లోబల్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(జీఎన్సీఏపీ) భారత దేశంలో లాంచ్ అయిన కొన్ని కార్లను పరీక్షించింది. 2014 నుంచి మార్కెట్లోకి విడుదలైన డజన్ల కొద్దీ కార్లపై క్రాష్ టెస్ట్ నిర్వహించింది. దీనిలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దీనిలో చాలా కార్లు ఫెయిల్ అవ్వగా.. కొన్ని మాత్రం ఆ క్రాష్ట టెస్ట్ లో పాస్ అయ్యాయి.
ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. ముఖ్యంగా కార్లు రోజూ ప్రమాదానికి గురవుతుంటాయి. పెద్ద సంఖ్యలోనే ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. చాలా మంది క్షతగాత్రులు అవుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలోని కార్ల సేఫ్టీపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. మన దేశంలో కార్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి అసెస్ మెంట్ ప్రోగ్రామ్ లేదు. అయితే యూకేకి చెందిన గ్లోబల్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్(జీఎన్సీఏపీ) భారత దేశంలో లాంచ్ అయిన కొన్ని కార్లను పరీక్షించింది. 2014 నుంచి మార్కెట్లోకి విడుదలైన డజన్ల కొద్దీ కార్లపై క్రాష్ టెస్ట్ నిర్వహించింది. దీనిలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దీనిలో చాలా కార్లు ఫెయిల్ అవ్వగా.. కొన్ని మాత్రం ఆ క్రాష్ట టెస్ట్ లో పాస్ అయ్యాయి.
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అంటే..
గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (జీఎన్సీఏపీ) అనేది యూకే-ఆధారిత స్వచ్ఛంద సంస్థ ‘టువర్డ్స్ జీరో ఫౌండేషన్’ ద్వారా రూపొందించబడింది. కార్లలో భద్రత ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఇది వివిధ కార్లకు క్రాష్ పరీక్షలను నిర్వహిస్తుంది. వాటి పనితీరు ఆధారంగా వాటికి రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్‌లు రెండు పారామీటర్‌ల ఆధారంగా ఇస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్(ఏఓపీ), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్(సీఓపీ). ఏఓపీ అంటే డ్రైవర్, కారులోని ఇతర పెద్దలపై కారు క్రాష్ ప్రభావాన్ని కొలుస్తుంది. అదే సమయంలో సీఓపీ పిల్లలపై ప్రమాద తీవ్రతను వివరిస్తుంది.
భారత దేశంలో సేఫెస్ట్ కార్లు ఇవే..
జీఎన్సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో మన దేశంలో లాంచ్ అయిన చాలా కార్లు ఫెయిల్ అవ్వగా.. మరికొన్ని కార్లు మంచి రేటింగ్ సాధించాయి. మంచి రేటింగ్ సాధించిన కార్లేంటో చూద్దాం రండి..
స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్.. గ్లోబల్ ఎన్సీఏపీ ర్యాంకింగ్స్‌లో టాప్ స్కోరర్‌ల జాబితాలో స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్ నిలిచాయి. ఈ రెండు ఎస్‌యూవీ కార్లు ఏఓపీ టెస్ట్ లో 34కి 29.64 పాయింట్లు సీఓపీలో 49కి 42 పాయింట్లు సాధించాయి.
వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా.. ఈ రెండు కార్లు ఏఓపీ, సీఓపీ టెస్టుల్లో ఉత్తమ రేటింగ్ సాధించాయి. 5స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సెడాన్‌లు ఏఓపీలో 34 పాయింట్లకు 29.71 పాయింట్లు సీఓపీలో 49 పాయింట్లకు 42 పాయింట్లు సాధించాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 700.. ఇది కూడా తన బ్రాండ్ విలువను నిలుబెట్టుకుంది. కఠినమైన పరీక్షల్లోనూ నిలబడి 5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఏఓపీలో 17 పాయింట్లకు 16.03 పాయింట్లు, సీఓపీలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లను సాధించింది.
టాటా పంచ్.. ఇది పెద్ద విభాగంలో నిర్వహించిన ఏఓపీ టెస్ట్ లో 5స్టార్ రేటింగ్.. పిల్లల విభాగంలోని సీఓపీ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ సాధించింది. టాటా పంచ్ పెద్దల విభాగంలో GNCAP పరీక్షలో పూర్తి ఐదు రేటింగ్‌లను పొందింది. ఏఓపీలో 17 పాయింట్లకు 16.45 పాయింట్లు, సీఓపీలో 49 పాయింట్లకు 40.89 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300.. ఈ కారు కూడా పెద్దల భద్రతలో 5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. పిల్లల భద్రతలో మాత్రం 4 స్టార్ రేటింగ్ ను అందుకుంది. ఏఓపీలో 17 పాయింట్లకు 16.42 పాయింట్లు సీఓపీ విభాగంలో 49కి 37.44 పాయింట్లు సాధించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..