AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?

Aadhaar Loan: ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ ఇస్తామంటూ వచ్చే ప్రకటనలు నకిలీవి. ప్రభుత్వం అటువంటి "ప్రధానమంత్రి లోన్ స్కీమ్"ను ప్రోత్సహించడం లేదు. వ్యక్తిగత వివరాలు, OTP పంచుకోవద్దు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో నివేదించండి.

Aadhaar Loan: ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం రూ.3 లక్షల లోన్‌ ఇస్తోందా..?
Aadhaar Loan
Subhash Goud
|

Updated on: Jul 01, 2026 | 8:12 AM

Share

Aadhaar Loan Fraud Alert: ఈ రోజుల్లో మంచికంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఉచితంగా లోన్‌ ఇస్తుందని, వివిధ పథకాలలో దరఖాస్తు చేసుకుంటే అకౌంట్లు డబ్బులు వేస్తోందని రకరకాల రూమర్లు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది అమాయకులు ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మి మోసపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్‌ అవుతోంది. ఆధార్ కార్డు వివరాలు ఇస్తే రూ.3 లక్షల వరకు లోన్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ప్రకటనలపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. “ప్రధానమంత్రి లోన్ స్కీమ్” పేరుతో వస్తున్న ఈ ఆఫర్‌లు పూర్తిగా నకిలీవని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: LPG Cylinder Price: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!

ప్రభుత్వం ఎప్పుడూ లోన్ పథకాలను ప్రకటనల ద్వారా ప్రచారం చేయదని PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది. ఈ నకిలీ ప్రకటనలలోని లింక్‌లను క్లిక్ చేసినప్పుడు, మోసగాళ్లు ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.499 లేదా రూ.599 వంటి చిన్న మొత్తాలను చెల్లించమని అడుగుతారు. ఆ తర్వాత ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలను కోరతారు. చివరకు, OTPని నమోదు చేయమని అడిగి, ఖాతాదారుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండాలంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ లోన్ ప్రకటనలను నమ్మవద్దు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దు.. మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ పంచుకోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే మీ వివరాలను పంచుకున్నా లేదా మోసానికి గురైనా, తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. వేగంగా నివేదించడం ద్వారా లావాదేవీని నిలిపివేసి, నిధులను తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి: Whatsapp New Feature: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ యూజర్లకు తలనొప్పిగా మారనుందా? కారణం ఇదే..!

ఇది కూడా చదవండి: Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని దివాలా తీయిస్తోందా? కంటికి కనిపించని ఈ ఛార్జీల గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us