AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Price: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!

LPG Cylinder Price: గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలు దాదాపు ఏడాది కాలం తర్వాత గత మార్చి 7న రూ. 60 పెరిగాయి. ఆ తర్వాత జూన్ 7న మరో రూ. 29 పెరగడంతో ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర..

LPG Cylinder Price: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!
Gas Cylinder Price
Subhash Goud
|

Updated on: Jul 01, 2026 | 7:05 AM

Share

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీన గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. సిలిండర్‌ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.183.50 తగ్గించింది. ఈ తగ్గింపు తర్వాత గతంలో రూ.3,113.50గా ఉన్న దాని ధర ఇప్పుడు రూ.2,930కి చేరింది. 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఈ సంవత్సరం తొలిసారిగా వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింది. జనవరి 2026లో ఢిల్లీలో దీని ధర రూ. 1691.50 ఉండగా, జూన్ నాటికి అది దాదాపు రెట్టింపు అయింది. మార్చి 2026లో దీని ధరలు రెండుసార్లు పెరిగాయి. మార్చి 1న వాణిజ్య సిలిండర్ ధర రూ. 28 పెరగగా, మార్చి 7న అది రూ. 114.50 పెరిగింది. మే నెలలో దీని ధర ఏకంగా రూ. 993 పెరగడంతో ఢిల్లీలో ధర నేరుగా రూ. 3071.50కి చేరింది. జూన్ 1న ఇది రూ. 42 పెరిగింది.

ఇది కూడా చదవండి: RBI Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దు కానున్నాయా?

ఇవి కూడా చదవండి

ఈరోజు ధరల తగ్గింపు తర్వాత న్యూఢిల్లీలో 19 కిలోగ్రాముల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.2,930కి తగ్గింది. కోల్‌కతాలో రూ.3,255.50 నుండి రూ.3,081.50కు తగ్గింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నిన్నటి వరకు కూడా కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,105.50 నుంచి 2,321 వద్ద ఉండేది. తాజా తగ్గింపుతో రూ. 2000 వేల దిగువకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటరుకు రూ.1.5 నుండి రూ.4కు పెంచింది. ఈ చర్య జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది.

ఇక గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలు దాదాపు ఏడాది కాలం తర్వాత గత మార్చి 7న రూ. 60 పెరిగాయి. ఆ తర్వాత జూన్ 7న మరో రూ. 29 పెరగడంతో ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.942 వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్‌లో రూ.900కుపైగా చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గృహ వినియోగ సిలిండర్లపై రూ. 89 భారం పడగా, ఈ నెలలో ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచడం సామాన్యులకు కొంతవరకు ఉపశమనం కలిగించే విషయమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..

ఇది కూడా చదవండి: Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని దివాలా తీయిస్తోందా? కంటికి కనిపించని ఈ ఛార్జీల గురించి మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us