AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!

LPG Cylinder Safety: చాలామంది గ్యాస్ సిలిండర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని పొరపడుతుంటారు. వాస్తవానికి, సిలిండర్‌పై ఉండేది టెస్ట్ డ్యూ డేట్ కోడ్ మాత్రమే. ప్రతి సిలిండర్ దాని భద్రతను నిర్ధారించడానికి క్రమానుగతంగా తనిఖీ చేయబడుతుంది. ఈ కోడ్‌ను ఎలా చదవాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుని మీ ఇంటి భద్రతను పెంచుకోండి..

Gas Cylinder: ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!
Gas Cylinder
Subhash Goud
|

Updated on: Jun 30, 2026 | 12:45 PM

Share

LPG Cylinder Safety: గ్యాస్ సిలిండర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చాలామంది అపోహ పడుతుంటారు. వాస్తవానికి ఎల్‌పిజి సిలిండర్లకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. సిలిండర్‌పై ముద్రించిన B-21 లేదా D-28 వంటి కోడ్ “స్టాట్యుటరీ టెస్టింగ్ డ్యూ డేట్”ను సూచిస్తుంది. సిలిండర్ భద్రతను నిర్ధారించడానికి దీనిని క్రమానుగతంగా తనిఖీ చేయాలి.

ఈ కోడ్‌ను ఎలా చదవాలంటే: ఆంగ్ల అక్షరం సంవత్సరంలోని క్వార్టర్‌ను సూచిస్తుంది (A: జనవరి-మార్చి, B: ఏప్రిల్-జూన్, C: జూలై-సెప్టెంబర్, D: అక్టోబర్-డిసెంబర్). పక్కన ఉన్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది (ఉదాహరణకు, 21 అంటే 2021, 28 అంటే 2028). ఉదాహరణకు, D-28 అంటే ఆ సిలిండర్‌ను అక్టోబర్ నుండి డిసెంబర్ 2028 మధ్య భద్రతా తనిఖీ కోసం పంపాలి.

ఇది కూడా చదవండి: Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!

ఇవి కూడా చదవండి

ఒక కస్టమర్ తన ఇంటికి వచ్చిన సిలిండర్‌పై B-21 కోడ్ ఉండటాన్ని గమనించి, దానిని తిరస్కరించారు. ఎందుకంటే 2021 ఏప్రిల్-జూన్ నాటికి ఆ సిలిండర్‌ను తనిఖీ చేసి ఉండాలి. టెస్ట్‌లో పాస్ అయితేనే మళ్లీ రీఫిల్లింగ్ చేస్తారు. కొత్త డ్యూ డేట్ కోడ్ వేస్తారు. ఫెయిల్ అయితే సిలిండర్‌ను స్క్రాప్ చేస్తారు. అందువల్ల గడువు తీరిన కోడ్ ఉన్న సిలిండర్‌ను తీసుకోవడం సురక్షితం కాదు.

అనంతరం D-28 కోడ్‌తో ఉన్న సిలిండర్‌ను తీసుకుని, అది 2028 చివరి త్రైమాసికం వరకు పరీక్షకు గడువు ఉందని ధృవీకరించారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయినప్పుడు సీల్, లీకేజీ వాసనతో పాటు ఈ టెస్ట్ డ్యూ డేట్ కోడ్‌ను కూడా తప్పకుండా తనిఖీ చేయాలి. మీ కుటుంబ భద్రతకు ఇది చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర..!

Follow Us
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!