Aadhaar Card: ఆధారే అన్నింటికీ ఆధారం.. ఆధార్ లాకింగ్ అంటే తెలుసా?

భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డ్ అనే తప్పనిసరి అవసరంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలికాం కనెక్షన్‌ల వంటి సేవల కోసం ఆధార్ తప్పనిసరైంది. అయితే ఈ ఆధార్ కార్డు ఆధారంగా ఇటీవల మోసాలు పెరిగాయి. కాబట్టి ఆధార్ దుర్వినియోగం కాకుండా ఆధార్ లాక్ చేసుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఆధార్ లాక్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Aadhaar Card: ఆధారే అన్నింటికీ ఆధారం.. ఆధార్ లాకింగ్ అంటే తెలుసా?
Aadhar Card
Follow us
Srinu

|

Updated on: Nov 21, 2024 | 4:49 PM

సాధారణంగా ప్రతి చిన్న అవసరానికి ఆధార్ ముఖ్యమైన పత్రంగా మారింది. ఈ నేపథ్యంలో చాలా చాలా చోట్ల మన ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తున్నాం. అయితే ఆ ఆధార్‌ను ఆధారంగా చేసుకుని ముష్కరులు బ్యాంకింగ్ మోసాలకు తెగబడుతున్నారు. అలాగే పలు చోట్ల ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. కానీ పెరిగిన టెక్నాలజీతో ఎవరైనా మీ ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తుంటే చాలా సులభంగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ ఆధార్ ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నారో? మీకు నేరుగా తెలియదు, కానీ మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించారో? మాత్రం కచ్చితంగా తనిఖీ చేయవచ్చు. 

ఆధార్ హిస్టరీ చెకింగ్

  • మై ఆధార్ పోర్టల్‌కి వెళ్లాలి.
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • “ప్రామాణీకరణ చరిత్ర” ఎంపికను ఎంచుకుని మీరు వివరాలను చూడాలనుకుంటున్న తేదీని ఎంచుకోవాలి. 
  • అక్కడ డిస్‌ప్లేపై కనిపిస్తున్న లాగ్‌లను తనిఖీ చేసి, ఏవైనా అనుమానాస్పద లేదా తెలియని లావాదేవీలను గుర్తించాలి.
  • ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనుగొంటే వెంటనే 1947 లేదా help@uidai.gov.inకు తెలియజేయాలి. 

బయోమెట్రిక్‌లను లాక్ చేయడం

యూఐడీఏఐ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్, అన్‌లాక్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. తద్వారా దుర్వినియోగాన్ని నివారించవచ్చు. బయోమెట్రిక్‌లు లాక్ చేస్తే ఎవరైనా మీ ఆధార్ వివరాలను యాక్సెస్ చేసినప్పటికీ అతను మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించకుండా నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

బయోమెట్రిక్స్ లాకింగ్ ప్రక్రియ

  • యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • “లాక్/అన్‌లాక్ ఆధార్” విభాగంపై క్లిక్ చేయాలి. 
  • ఇచ్చిన సూచనలను చదవి, అవసరమైన సమాచారాన్ని పూరించాలి. ఓటీపీను పంపు”పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీను నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేసి మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి