Aadhaar Card Update: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!

Aadhaar Card Update: ప్రస్తుతం భారత్‌లో ఆధార్‌ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు..

Aadhaar Card Update: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
Aadhaar Card Update
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2022 | 9:00 AM

Aadhaar Card Update: ప్రస్తుతం భారత్‌లో ఆధార్‌ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ ముఖ్యమైనదిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డు అప్‌డేట్‌కు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పదేళ్లకోసారి తమ బయోమెట్రిక్‌ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్‌ చేయాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) ప్రజలను కోరింది.

యూఐడీఏఐ ప్రస్తుతం 5, 15 సంవత్సరాల వయసు దాటిన పిల్లను ఆధార్‌ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి చేసింది. యూఐడీఏఐ ప్రజలను వారి బయోమెట్రిక్స్‌, డెమో గ్రాఫిక్స్‌ వంటివి పదేళ్ల కోసారి అప్‌డేట్‌ చేయమని కోరుతుంటుంది. ఒక వ్యక్తి నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత 70 ఏళ్ల వయస్సు వారికి అవసరం లేదు. యూఐడీఏఐ మేఘాలయ, నాగాలాండ్, లడఖ్‌లలో కొద్ది శాతం మంది మినహా దేశంలోని దాదాపు అందరు వయోజనులను నమోదు చేసింది.

దేశంలోని చాలా ఆసుపత్రుల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ కార్డును నమోదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీ సమీపంలోని ఆధార్ కేంద్రం లేదా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా మీరు మీ పిల్లల ఆధార్ కార్డును పొందవచ్చు. పిల్లల ఆధార్‌ను పొందడానికి, మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూరించాలి. అందులో మీరు పిల్లలకు సంబంధించిన అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఫారమ్‌తో పాటు, మీరు కొన్ని ముఖ్యమైన పత్రాల ఫోటోకాపీలను కూడా జతచేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..