Aadhaar Update: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా? అసలు విషయం తెలిస్తే షాక్
ప్రస్తుత భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడం నుంచి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం వరకు అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు చాలా అవసరం అవుతుంది. ఆధార్ కార్డును చాలా మంది గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఈ కార్డులో కీలకమైన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. అయితే ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు విషయంలో కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో దేశంలో ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే చాలా మంది కాలక్రమేణా తమ మొబైల్ నంబర్లను మార్చుకుంటారు. అందువల్ల ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీ ఆధార్ వివరాలు అంటే ముఖ్యంగా మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీ మొబైల్ నంబర్ మారితే దానిని మీ ఆధార్ రికార్డులో నవీకరించడం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆధార్-లింక్డ్ సేవలను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయాలి. ఎందుకంటే ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో గుర్తింపు ధ్రువీకరణ కోసం రిజిస్టర్డ్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ పంపుతారు. మీ ప్రస్తుత నంబర్‌ను అప్‌డేట్ చేయడం వల్ల ఆధార్‌కు అనుసంధానించిన వివిధ డిజిటల్ సేవలకు సజావుగా యాక్సెస్ లభిస్తుంది.
ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరం కాబట్టి మీరు మీ ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌ను నేరుగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయలేరు. దీన్ని చేయడానికి మీరు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి లేదా అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం ఇలా
- సులభమైన నావిగేషన్ కోసం అధికారిక యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
- నా ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకుని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి.
- మీ నగరం లేదా స్థానాన్ని నమోదు చేసి ‘అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి కొనసాగండి’పై క్లిక్ చేయాలి.
- మీ ప్రస్తుత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి ఆపై ‘ఓటీపీ రూపొందించు’పై క్లిక్ చేయండి.
- ఆపై ఓటీపీను ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, దరఖాస్తు రకం, రాష్ట్రం, నగరం, ఇష్టపడే ఆధార్ సేవా కేంద్రంతో సహా ఆధార్ ప్రకారం మీ వివరాలను పూరించాలి.
- మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న డేటా ఫీల్డ్‌ను ఎంచుకోవాలి. అంటే అప్‌డేట్ మొబైల్ నంబర్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని మీ అపాయింట్‌మెంట్‌ను నిర్ధారించడానికి సమర్పించుపై క్లిక్ చేయాలి.
- మీరు ఎంచుకున్న తేదీ, సమయంలో ఎంపిక చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అప్పుడు అధికారులు బయోమెట్రిక్ ధృవీకరణను నిర్వహించి, ఆధార్ డేటాబేస్‌లో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేస్తారు. ఈ అప్‌డేట్ కోసం రూ. 50 సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.








