Credit Card Charges: ఆ రెండు బ్యాంకుల క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్.. బిల్లుల చెల్లింపుపై చార్జీల బాదుడు

టెలికమ్యూనికేషన్, విద్యుత్, గ్యాస్, నీరు, ఇంటర్నెట్ సేవలు, కేబుల్ సేవల వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించే వారి సంఖ్యం బాగా పెరిగింది. కానీ యస్ బ్యాంక్ లేదా ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతి త్వరలో ఈ చెల్లింపులు చేయడం మరింత ఖరీదైనదిగా మారుతుందని తెలుస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై సర్‌ఛార్జ్ విధించాలని రెండు బ్యాంకులు నిర్ణయించాయి.

Credit Card Charges: ఆ రెండు బ్యాంకుల క్రెడిట్‌కార్డు యూజర్లకు షాక్.. బిల్లుల చెల్లింపుపై చార్జీల బాదుడు
Credit Card
Follow us
Srinu

|

Updated on: Apr 18, 2024 | 4:00 PM

బ్యాంకింగ్ విషయంలో పెరిగిన టెక్నాలజీ చాలా సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వల్ల రోజువారీ లేదా నెలవారీ బిల్లుల చెల్లింపు మరింత సులభమైంది. అయితే టెలికమ్యూనికేషన్, విద్యుత్, గ్యాస్, నీరు, ఇంటర్నెట్ సేవలు, కేబుల్ సేవల వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించే వారి సంఖ్యం బాగా పెరిగింది. కానీ యస్ బ్యాంక్ లేదా ఐడీఎఫ్ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగదారులకు ఆయా బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతి త్వరలో ఈ చెల్లింపులు చేయడం మరింత ఖరీదైనదిగా మారుతుందని తెలుస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై సర్‌ఛార్జ్ విధించాలని రెండు బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నిబంధన మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే రెండు బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లించడంపై సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు, చాలా బ్యాంకులు యుటిలిటీ బిల్లులు, బీమా, అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు ఇవ్వడం నిలిపివేశాయి. ఈ పెంపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 15,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లింపులపై 1 శాతం సర్‌ఛార్జ్, జీఎస్టీ విధిస్తుంది. అయితే యస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై ఎటువంటి సర్‌ఛార్జ్ ఉండదు. ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ. 20,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లింపులపై ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 1 శాతం సర్‌ఛార్జ్, జీఎస్టీను విధిస్తుంది. అయితే యుటిలిటీ సర్‌ఛార్జ్ యొక్క ఈ నియమం మొదటి ప్రైవేట్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ఎల్ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌లకు వర్తించదు. ఆయా కార్డులతో అద్దె లావాదేవీలపై సర్‌ఛార్జ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు ఇప్పుడు ఈ పద్ధతిని యుటిలిటీ లావాదేవీలకు విస్తరిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ సేవలు బ్యాంకుకు తక్కువ మార్జిన్ వ్యాపార వర్గం కాబట్టి యస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత ఇతర బ్యాంకులు సర్‌ఛార్జ్‌లను ప్రవేశపెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.  వ్యక్తిగత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి యుటిలిటీ లావాదేవీలు చేసే వారికి వ్యాపార ఖర్చులు ఉంటున్నాయని, క్రెడిట్ కార్డు వినియోగదారులు వాటిపై రివార్డ్‌లను సంపాదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి బ్యాంకులు యుటిలిటీ లావాదేవీలపై సర్‌ఛార్జ్‌లను అమలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..