New Smartphones: లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..

కొనుగోలుదారులు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. డబ్బుకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ధర ఎంతైనా అత్యాధునిక ఫీచర్లను కలిగిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో కొన్ని టాప్ బ్రాండ్లు బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. వాటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందుకు తగ్గ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆ ఫోన్లలో ఉన్నాయి. ఇంతకీ ఎంటా ఫోన్లు. చూసేద్దాం రండి..

New Smartphones: లేటెస్ట్ అండ్ హాటెస్ట్.. 2024లో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఇవే..
Samsung Galaxy S24 5g
Follow us
Madhu

|

Updated on: Apr 18, 2024 | 8:43 AM

మార్కెట్ లో రోజుకొక కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలవుతోంది. వీటిలో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉంటున్నాయి. ప్రస్తుతం హైటెక్నాలజీ, ఏఐ ఫీచర్ ఉన్న ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొనుగోలుదారులు వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. డబ్బుకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ధర ఎంతైనా అత్యాధునిక ఫీచర్లను కలిగిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో కొన్ని టాప్ బ్రాండ్లు బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. వాటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. అందుకు తగ్గ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఆ ఫోన్లలో ఉన్నాయి. ఇంతకీ ఎంటా ఫోన్లు. చూసేద్దాం రండి..

షావోమీ 14 అల్ట్రా(Xiaomi 14 Ultra)..

ఈ స్మార్ట్ ఫోన్ మెరుగైన పనితీరు, మంచి కెమెరా నాణ్యతతో ఆకట్టుకుంటుంది. హైఎండ్ గేమ్‌లను ఆడటానికి చాలా ఉపయోగపడుతుంది. 6.73 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కారణంగా వీడియోలను చాలా స్పష్టంగా చూడవచ్చు. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 మొబైల్ ఫ్లాట్ ఫాం ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 50 ఎంపీ నాలుగు రీయల్ కెమెరాలు, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకతలు. గ్జియోమి హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ధర రూ.1,00,000.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ(Samsung Galaxy S24 5G)..

ఈ ఫోన్ లోని ఫీచర్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని స్మార్ట్ ఏఐను ఉపయోగించి పనిని చాలా సులభంగా చేయవచ్చు. పరిమిత ఎత్తు నుంచి కిందకు జారి పడినా పగిలిపోదు. 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, సామ్సంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50 ఎంపీ, 12 ఎంపీ, 10 ఎంపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ రూ. 87,999కు అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ 12 (Oneplus 12)..

ఈ స్మార్ట్ ఫోన్ పనితీరుపై కస్టమర్లు మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. అద్భుతమైన కెమెరా నాణ్యత, అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్‌ ఆప్షన్ తో అందుబాటు ధరలో లభిస్తుంది. 6.82 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తో ఆకట్టుకుంటుంది. 100 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్టు చేసే 5400 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి ప్రత్యేకత. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు 50 ఎంపీ, 64 ఎంపీ, 48 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ రూ.64,999కి లభిస్తుంది.

నథింగ్ ఫోన్(2ఎ)(Nothing phone (2) 5G..

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగం స్టైలిష్‌గా కనిపిస్తుంది. ముందువైపు 6.7 అంగుళాల ఎల్టీపీవో ఓలెడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పటికీ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 సీపీయూతో లభిస్తుంది. అలాగే 8 జీబీ, 12 జీబీ ర్యామ్ లతో పాటు 128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా, 50 ఎంపీల రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్. దీని ధర 44,918.

వన్ ప్లస్ (Oneplus 12R)..

వన్ ప్లస్ 12తో పోలిస్తే ఈ ఫోన్ చాలా మెరుగైనది. ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లే చాలా బాగుంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 1 టీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీ తో వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ తో చార్జింగ్ ఎక్కువ గంటలు వస్తుంది. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ 42,999 ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..