AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Scams: ఉద్యోగాల పేరుతో నయా మోసం.. గుర్తించకపోతే మీ జేబు గుల్లే..!

ఇటీవల భారతదేశంతో పాటు విదేశాలలో భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ నియామకాల స్కామ్‌లు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామర్‌లు యువత ముఖ్యంగా ఇటీవలి గ్రాడ్యుయేట్‌లు, విదేశాలలో ఉపాధి కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్న వారి ఆసక్తిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Job Scams: ఉద్యోగాల పేరుతో నయా మోసం.. గుర్తించకపోతే మీ జేబు గుల్లే..!
Jobs
Nikhil
|

Updated on: Jun 02, 2024 | 6:00 PM

Share

ఇటీవల భారతదేశంతో పాటు విదేశాలలో భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ నియామకాల స్కామ్‌లు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామర్‌లు యువత ముఖ్యంగా ఇటీవలి గ్రాడ్యుయేట్‌లు, విదేశాలలో ఉపాధి కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్న వారి ఆసక్తిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి విదేశాల్లో ఉద్యోగాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ జాబ్ ఆఫర్ ఏదైనా నిర్దిష్ట పరిశ్రమకే పరిమితం కాకుండా ఏ రంగంలోనైనా ఉండవచ్చు. ఇటీవలి కాలంలో పరిశ్రమలు, సంస్థలలో స్కామర్లు మోసపూరిత ఉద్యోగ ఆఫర్‌లను పోస్ట్ చేస్తున్న రిక్రూట్‌మెంట్ మోసాల సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసపూరిత జాబ్ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ప్రపంచవ్యాప్తంగా మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడానికి భారతీయులను వాడుతున్నారని తాజాగా ఓ విషయంలో వెల్లడైంది. మే 27న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నకిలీ జాబ్ రాకెట్‌లో ప్రమేయం ఉందనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల కోసమని మోసం చేసి భారతీయ యువకులను ప్రలోభపెట్టి విదేశాలకు తరలించే వ్యవస్థీకృత ట్రాఫికింగ్ సిండికేట్‌లో నిందితులు నిమగ్నమై ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా యువత నకిలీ కాల్ సెంటర్‌లలో పని చేసేలా వారిని బలవంతం చేశారు. లావోస్ అని పిలిచే లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (పీడీఆర్)లో థాయ్‌లాండ్ ద్వారా ఉపాధి కోసం భారతీయ పౌరులను రప్పిస్తున్న సందర్భాలు కూడా ఇటీవల గమనించారు. ఈ నకిలీ ఉద్యోగాలు డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు’ లేదా ‘కస్టమర్’ వంటి పోస్ట్‌లకు సంబంధించినవని ఈ ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

లావోస్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కేంద్రం అనే విషయం చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడే కాల్ సెంటర్ స్కామ్‌లు, ఫేక్ రివ్యూ స్కామ్‌లు, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలతో సహా వివిధ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు వెలిశాయి. ఆయా కంపెనీలు చట్టబద్ధమైన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో అన్ని ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా మోసపూరితమైనవి కావు అని గమనించాలని పలువురు నిపుణులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉద్యోగాలంటే ఎగబడకుండా అన్ని వివరాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us