Fish Farming: సింగ్ ఈజ్ ‘చేపల’ కింగ్.. ఏడాదికి ఏకంగా రూ.25 లక్షల ఆదాయం
బిహార్ రాష్ట్రానికి చెందిన అశుతోష్ కుమార్ సింగ్ చేపల పెంపకంలో కొత్త విధానాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. కేవలం శ్రమను నమ్ముకుని పనిచేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాడు. ఒకప్పుడు నిరుద్యోగిగా తీవ్ర ఇబ్బందులు పడిన సింగ్.. ఇప్పుడు ఏడాదికి రూ.25 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. ఈయన విజయగాథను తెలుసుకుందాం..
ఏదైనా సాధించాలనే తపన, దానికి తగిన కృషి ఉంటే విజయం వెనకే వస్తుంది. మన కళ్ల ముందున్న అనేక మంది ఈ విషయాన్ని రుజువు చేశారు. శ్రమను నమ్ముకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యం సాధించారు. ఆయా రంగాలలో అనేక మందికి ఆదర్శంగా నిలిచారు.
చేపల పెంపకంలో కొత్త విధానాలు..
బిహార్ రాష్ట్రానికి చెందిన అశుతోష్ కుమార్ సింగ్ చేపల పెంపకంలో కొత్త విధానాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. కేవలం శ్రమను నమ్ముకుని పనిచేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నాడు. ఒకప్పుడు నిరుద్యోగిగా తీవ్ర ఇబ్బందులు పడిన సింగ్.. ఇప్పుడు ఏడాదికి రూ.25 లక్షల వరకూ సంపాదిస్తున్నాడు. ఇతడి విజయగాథను తెలుసుకుందాం.
నష్టాలు వచ్చినా..
బీహార్ లోని బంకా జిల్లా పట్వారా గ్రామానికి అశుతోష్ కుమార్ సింగ్ ఒక నిరుద్యోగి. డబ్బులు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా చేపల పెంపకంలో ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాడు. తర్వాత 15 బిఘాల భూమిలో చేపలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. చేపల పెంపకంలో శిక్షణ లేకపోయినా ముందడుగు వేశాడు. అయితే చాలా నష్టాలను చవిచూశాడు. అయినా పట్టువదల్లేదు. తనకు ఇష్టమైన చేపల పెంపకంలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుని మళ్లీ చేపల పెంపకం ప్రారంభించాడు. ఈసారి విజయం సాధించాడు. అతడు తన ఐదు చెరువులలో సిలాన్, ఐఎంసీ రోహు, కట్లా, మృగాల్ తదితర రకాల చేపలను పెంచుతున్నాడు.
కొత్త విధానాలు..
చేపల పెంపకం అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటి. దీని ద్వారా పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. చాలామంది దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం లేదు. కేవలం సేంద్రియ వ్యవసాయం చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కానీ అశుతోష్ కుమార్ సింగ్ కొత్త విధానాలు అవలంబించాడు. తన సమయాన్ని, శ్రమను, డబ్బును చేపల పెంపకంలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ రంగంలో విజయం సాధించాడు. ప్రస్తుతం ఏడాదికి రూ.25 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. తన 15 బిఘాలలో ఐదు చెరువులు నిర్మించి వాటిలో చేపల పెంపకం కొనసాగిస్తున్నాడు. అశుతోష్ దాదాపు పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నాడు.
లాభదాయకం..
సిలాన్, ఇండియన్ మేజర్ కార్ప్ (ఐఎంసీ) చేపలను పెంపకంలో లాభాలు బాగుంటాయని అనుతోష్ చెబుతున్నారు. ఒక కిలో సిలాన్ చేపల పెంపకానికి దాదాపు రూ.80 నుంచి రూ.90 వరకూ ఖర్చవుతుంది. ఐఎంసీ రోహు చేప సంతానోత్పత్తికి 13 నెలలు పడుతుంది. అయితే సీలాన్ చేప 7 నుంచి 8 నెలల్లో అమ్మకానికి సిద్ధమవుతుంది. కిలో సిలాన్ చేపలను రూ.110, ఐఎంసీ జాతి చేపలను రూ.250కి విక్రయిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం..
చేపల పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అశుతోష్ కుమార్ సింగ్ చెబుతున్నాడు. ఎకరా చెరువులో 15 కిలోల సున్నాన్ని 15 రోజుల వ్యవధిలో వాడాలని సూచించాడు. ఇన్ఫెక్షన్ నుంచి చేపలను రక్షించడానికి అతడు ఎకరానికి 400 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్‌ను ఉపయోగిస్తున్నాడు. చెరువు నీరు ఆకుపచ్చగా మారితే సున్నం, రసాయన ఎరువులు వాడకాన్ని మానివేయాలన్నాడు. చేపలను శిలీంధ్ర వ్యాధి నుంచి రక్షించడానికి, ఒక కిలో సప్లిమెంటరీ ఫీడ్‌లో 5 నుంచి 10 గ్రాముల ఉప్పు కలపాలని చెప్పాడు. చేపల పెంపకంతో పాటు సీడ్ ను కూడా ఆయన విక్రయిస్తున్నాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..