5G Spectrum: రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం వేగంగా అడుగులు..

5G Spectrum: 5G టెలిసర్వీసెస్ కోసం మెగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రిజర్వ్ ధర రూ. 4. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

5G Spectrum: రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవలు.. స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం వేగంగా అడుగులు..
Spectrum
Follow us

|

Updated on: Jun 15, 2022 | 3:05 PM

5G Spectrum: 5G టెలిసర్వీసెస్ కోసం మెగా స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రిజర్వ్ ధర రూ. 4. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న రెండు నెలల కాలంలో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ స్పెక్ట్రమ్ అమ్మకానికి ఆమోదం తెలిపిందని వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం ఒకేసారి 1 లక్ష MHz మొబైల్ ఎయిర్‌వేవ్‌లను వేలం వేయనుంది. ఇది మొత్తం అమ్మకానికి ఉంచిన పరిమాణంలో రికార్డని తెలుస్తోంది.

అయితే ఇంతకు ముందు సారి వేలంలో ప్రభుత్వం ఉంచిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అనేక కంపెనీలు వేలానికి దూరంగా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న టెలికాం సంస్థలను దూకుడుగా వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు వీలుగా ఈ సారి వివిధ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో రిజర్వ్ ధరను గతం కంటే 40% తగ్గించాలని ట్రాయ్ సూచించింది. ఈ సారి నిర్వహిస్తున్న వేలంలో ప్రపంచవ్యాప్తంగా 5G సేవల కోసం తరచుగా ఉపయోగించే బ్యాండ్‌ల స్పెక్ట్రమ్ కూడా ఉంటుంది.

అధికారిక ప్రకటన ప్రకారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వ్యాపార ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం జూలై చివరి నాటికి 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. దేశంలోని మూడు ప్రధాన మెుబైల్ సర్వీస్ ప్రొవైడర్లైన  వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన జియో ప్రస్తుతం కేంద్రం తెస్తున్న వేలంలో పోటీ పడతాయని తెలుస్తోంది.

ఇదే క్రమంలో.. భారత్ ఈ దశాబ్దం చివరి నాటికి 6G సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి కార్యరూపం తెచ్చేందుకు, దీనిపై పని చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసిందని టెలిగ్రాఫ్ ఇండియా ఇంతకు ముందు నివేదించింది. ఏదేమైనా స్పెక్ట్రమ్ వేలంలో అధిక ధరలు కారణంగానే దేశంలో 5జీ సేవలు ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?