5G Technology: ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు.. మొదటగా హైదరాబాద్‌పాటు 12 నగరాల్లో ప్రారంభం..!
త్వరలో ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కనీసం 20-25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు...

త్వరలో ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కనీసం 20-25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు-సెప్టెంబరు కల్లా 5జీ సేవలు మొదలవుతాయని శనివారం జరిగిన ఒక సదస్సులో ఆయన చెప్పారు. కాగా ప్రారంభ దశలో 5జీ సేవలు అందుకునే ఆ నగరాల పేర్లను వైష్ణవ్ వెల్లడించలేదు. 2022 ఏడాదిలోగా తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు మొదలవుతాయని టెలికాం విభాగం(డాట్) డిసెంబరులో పేర్కొన్న సంగతి తెలిసిందే. డాట్ ప్రకటించిన జాబితాలో దిల్లీ, గురుగ్రామ్, ముంబయి, పుణె, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు చండీగఢ్, లఖ్‌నవూ, అహ్మదాబాద్, గాంధీనగర్, జామ్‌నగర్ ఉన్నాయి.
5జీ వేలాన్ని నిర్వహించడం కోసం డాట్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. సోమవారం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన బిడ్ ముందస్తు సమావేశాన్ని కూడా డాట్ నిర్వహించనుంది. రూ.4.5 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలంలో ఉంచనుంది. అయితే టెలికం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ ధరలు తగ్గించాలని కోరుతున్నాయి. ప్రభుత్వం 20 సంవత్సరాల కాలానికి 72 GHz స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది.