AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు.. ఈ భర్తల కష్టం మరెవరికీ రాకూడదు

సామాన్య ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. కానీ ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిచ్‌లాల్ బ్లాక్‌లోని తొమ్మిది గ్రామాలకు చెందిన 11 మంది మహిళలు తమ ఖాతాల్లో మొదటి విడత పీఎం ఆవాస్ యోజన జమ కావడంతో భర్తలను వదిలి ప్రేమికులతో పారిపోయారు. ఈ విషయం బయటకు..

ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు.. ఈ భర్తల కష్టం మరెవరికీ రాకూడదు
Pradhan Mantri Awas Yojana
Subhash Goud
|

Updated on: Jul 08, 2024 | 4:26 PM

Share

సామాన్య ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు. కానీ ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిచ్‌లాల్ బ్లాక్‌లోని తొమ్మిది గ్రామాలకు చెందిన 11 మంది మహిళలు తమ ఖాతాల్లో మొదటి విడత పీఎం ఆవాస్ యోజన జమ కావడంతో భర్తలను వదిలి ప్రేమికులతో పారిపోయారు. ఈ విషయం బయటకు రావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. బాధిత భర్తలు బ్లాక్‌లోని ఉన్నతాధికారులను కలిసి విషయం గురించి వారికి తెలియజేశారు. దీంతో బ్లాక్ అధికారులు రెండవ విడత అందించకుండా చర్యలు ప్రారంభించారు.

రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌లో చాలా మంది అమ్మాయిలు తమ ప్రేమికులతో పారిపోవడానికి దీనిని ఒక మార్గంగా ఉపయోగించుకున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత తీసుకున్న తర్వాత 11 మంది మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారని ఆరోపించారు భర్తలు.

ఈ వార్త ఆ ప్రాంతమంతా దావానలంలా వ్యాపించింది. నివేదికల ప్రకారం.. భార్యలను కోల్పోయిన బాధితులు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతమందికి గృహ నిర్మాణ పథకం కింద అధికారులు తదుపరి విడత ఇవ్వకపోవడమే సమస్యగా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన ఈ సంఘటన జిల్లాలోని తుతిహరి, శీతలాపూర్, చాటియా, రాంనాదర్, బకుల్దిహ, ఖేషర కిషూన్‌పూర్, మేధౌలి గ్రామాలలో సుమారు 2350 మంది లబ్ధిదారులకు పిఎం ఆవాస్ యోజన విడతలవారీగా అందింది. వీరిలో పలువురి ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వీరిలో 11 మంది మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత రూ. 40,000 అందిన వెంటనే తమ భర్తలను విడిచిపెట్టి ప్రేమికుడితో వెళ్లిపోయారు. పీఎం ఆవాస్ యోజన కింద ఈ డబ్బును వేరే చోట ఉపయోగించినట్లయితే, వారి నుండి కూడా డబ్బు రికవరీ చేయబడుతుందనే నిబంధన ఉంది. గతంలో బారాబంకి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే ఏమిటి?

దీని కింద పేద, మధ్య తరగతి కుటుంబాలు శాశ్వత ఇళ్లు పొందుతాయి. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.2.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ఈ రాయితీ ఆదాయాన్ని బట్టి రుణంపై ఇస్తారు.