ప్రజా రవాణా కోసం రూ.18వేల కోట్లతో ప్రత్యేక పథకం.. ఆ లక్ష్యానికి రెండంకెల వృద్ధి తప్పనిసరి: నిర్మలా సీతారామన్‌

రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరుకోవాలంటే.. రెండంకెల వృద్ధి తప్పనిసరని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు...

ప్రజా రవాణా కోసం రూ.18వేల కోట్లతో ప్రత్యేక పథకం.. ఆ లక్ష్యానికి రెండంకెల వృద్ధి తప్పనిసరి: నిర్మలా సీతారామన్‌
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2021 | 1:07 PM

Budget 2021 – Nirmala Sitharaman speech highlights: రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరుకోవాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బలమైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. దానికోసం అభివృద్ధితోపాటు సంస్కరణలు కూడా ముఖ్యమని ఆమె పెర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 ఆర్థిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారి మధ్యలో ప్రతిష్టాత్మక 2021-22 బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టారు. రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరుకోవాలంటే.. రెండంకెల వృద్ధి తప్పనిసరని నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖమంత్రి తెలిపారు. జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేస్తున్నామన్నారు.

బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు.. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్వహణలో ఉన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరని నిర్మలా ప్రకటించారు. 6,835 ప్రాజెక్టులతో జాతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైపులైన్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 740 ప్రాజెక్టులకు విస్తరించామని.. దేశంలో వాయుకాలుష్య నియంత్రణకు రూ.2,217 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా తెలిపారు. పీపీపీ విధానంలో 7 పోర్టు ప్రాజెక్టులు చేపడుతున్నామని.. 2023 డిసెంబరు నాటికి పూర్తవుతాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం రూ.18 వేల కోట్లతో ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నట్లు నిర్మలా తెలిపారు. మరో 100 జిల్లాల్లో పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థను చేపట్టనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కూడా పోర్టబులిటీ విధానాన్ని అవలంభిస్తామన్నారు.

కరోనా సంక్షోభ సమయంలోనూ పెట్టబడుల ఉపసంహరణ.. కరోనా సంక్షోభ సమయంలోనూ పెట్టబడుల ఉపసంహరణను కొనసాగించినట్లు నిర్మలా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూరినట్లు ఆమె తెలిపారు. 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. బీపీసీఎల్‌, ఎయిరిండియా, ఐడీబీఐ, పవనాన్స్‌ కంటైనర్‌ కార్పొరేషన్లలో పెట్టుబడులను ఉపసంహరించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఎల్‌ఐసీ ఐపీవో విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. మూలధన మద్దతు కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు మరో కోటిమంది లబ్ధిదారులకు ఎల్‌పీజీ ఉజ్వల్ యోజన పథకాన్ని అందిచనున్నట్లు నిర్మలా తెలిపారు.

Also Read: