Budget 2021: నిరుద్యోగంపై దృష్టి సారించనున్న ప్రభుత్వం.. పీఎంకేవీవై పథకానికి బడ్జెట్ కేటాయింపు ఎక్కువగా..

Budget 2021: దేశంలో నిరుద్యోగంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Budget 2021: నిరుద్యోగంపై దృష్టి సారించనున్న ప్రభుత్వం.. పీఎంకేవీవై పథకానికి బడ్జెట్ కేటాయింపు ఎక్కువగా..
Follow us
uppula Raju

|

Updated on: Jan 22, 2021 | 2:25 PM

Budget 2021: దేశంలో నిరుద్యోగంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కరోనా వల్ల దేశంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. దీంతో ప్రభుత్వం ప్రధానమంత్రి నైపుణ్య అభివృద్ధి పథకం (pmkvy) యొక్క బడ్జెట్‌ను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీఎంకేవీవై పథకాన్ని ప్రధానమంత్రి 2015లో ప్రారంభించారు. 2020 నాటికి కోటి మందిని ఇందులో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2020 అక్టోబర్ నాటికి కేవలం 69,000 మంది మాత్రమే ఇందులో చేరగలిగారు.

ఈ పథకం యొక్క బడ్జెట్‌ను పెంచడం వల్ల ప్రభుత్వం దీనిపై మరింత దృష్టి సారించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. పీఎంకేవీవై పథకానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3002 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంతకు ముందు ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.2989 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కనుక ఈ సారి కచ్చితంగా బడ్జెట్‌ను పెంచుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 3,32,0403 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 16,32,334 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు పది, ఇంటర్ తప్పిన విద్యార్థులను ఈ పథకంలో చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కరోనా మహమ్మారి వల్ల మిలియన్ల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అందువల్ల, ఈ పథకం కింద ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్‌ను పెంచుతుందని అందరు భావిస్తున్నారు. కరోనా కారణంగా, ఆర్థిక వ్యవస్థ మందగించింది, ఆర్థిక కార్యకలాపాలు నెలల తరబడి మూసివేయటం వల్ల ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగ రంగంలో చాలా వెనకబడి ఉంది. కనుక ఎక్కువ మందికి ఉపాధి లభించే విధంగా ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్‌లో పీఎంకేవీవై పథకంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తోంది.

నిజాలను నిర్భయంగా చూపిస్తున్నాం.. ఇందులో ఎలాంటి కల్పితాలకు తావులేదంటున్న ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ నిర్మాత