AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: బడ్జెట్ పై కోటి ఆశలతో చిన్న రైతులు.. రాబోయే బడ్జెట్ నుంచి వారు కోరుకునేది ఏమిటి?

బిజ్నోర్‌కు చెందిన సుధీర్ రాజ్‌పుత్ అనే 42 ఏళ్ల రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో ఆయన మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. దీంతో కలిపి మొత్తం 3 ఎకరాలలో సుదీర్ రాజ్ పుత్ వ్యవసాయం(Agriculture) చేస్తున్నాడు.

Budget 2022: బడ్జెట్ పై కోటి ఆశలతో చిన్న రైతులు.. రాబోయే బడ్జెట్ నుంచి వారు కోరుకునేది ఏమిటి?
Agriculture Budget 2022
Shaik Madar Saheb
| Edited By: KVD Varma|

Updated on: Jan 28, 2022 | 12:14 PM

Share

బిజ్నోర్‌కు చెందిన సుధీర్ రాజ్‌పుత్ అనే 42 ఏళ్ల రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో ఆయన మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. దీంతో కలిపి మొత్తం 3 ఎకరాలలో సుదీర్ రాజ్ పుత్ వ్యవసాయం(Agriculture) చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించక.. కోవిడ్(COVID-19) పరిస్థితుల నేపధ్యంలో ఈయన తన పొలంలో చెరకు ఆలస్యంగా విత్తడం వల్ల ఈ ఏడాది దిగుబడి తగ్గింది. దీంతో పాటు డీజిల్ వంటి వ్యవసాయానికి అవసరమయ్యే వస్తువుల ధరలు బాగా పెరిగిపోవడంతో ఆయన నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించలేని స్థితికి జారిపోయాడు. సుధీర్ కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. అతని తల్లి, భార్య, ఒక కొడుకు అదేవిధంగా ఒక కూతురు సుధీర్ సంపాదన మీదే ఆధారపడి జీవిస్తున్నారు. పిల్లలిద్దరూ అక్కడకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ స్కూల్ బస్సులో చదువుకోవడానికి వెళ్లి వస్తుంటారు. ఇక సుదీర్ అదనపు ఆదాయం కోసం కొన్ని ఆవులను కూడా కొన్నాడు. ఆవు పాలను అమ్మడం వల్ల అతనికి అదనపు ఆదాయం లభిస్తోంది. ఇది పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చులకు ఉపయోగపడుతూ వస్తోంది. అయితే.. లాక్ డౌన్ కారణంగా.. అతని వ్యవసాయ ఆదాయం ప్రభావితం కాలేదు కానీ అతని పాల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. అప్పుడు జరిగిన ఆ నష్టం నుంచి సుదీర్ ఇప్పటకీ ఇంకా తేరుకోలేకపోతున్నాడు. లాక్డౌన్ (Lockdown)కారణంగా, అతని పిల్లలకు స్కూల్ బంద్ అయింది. వారి తరగతులు ఆన్‌లైన్‌లో చెప్పడం ప్రారంభం అయింది. దురదృష్టవశాత్తు, అతను తన పిల్లలకు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ ఏర్పాటు చేయలేకపోయాడు. పగలు రాత్రి పనిచేసినా సుధీర్ కేవలం రూ.1.2 లక్షలు మాత్రమే సంపాదించుకోగాలిగాడు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి:

కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్ సమ్మాన్ పథకం కోసం సుదీర్ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తరువాత అతనికి ఈ పథకం చేతికి అందడం ప్రారంభం అయింది. ఈ పథకం నుంచి డబ్బు అందుతున్న తరువాత కూడా అతని ఆదాయం నెలకు కేవలం రూ. 500 మాత్రమే పెరిగింది. నెలకు పది పదకొండు వేల రూపాయల ఆదాయంతో ఇంటి బాధ్యతలు తీర్చడం అంత సులభం కాదు. సుదీర్ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వారిలో రెండెకరాలు కూడా స్వంత భూమి లేని దాదాపు 90 శాతం ప్రజలలో ఒకడు. దేశంలో దాదాపు 70 కోట్లకు పైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆర్ధిక సర్వే 2020 లెక్క వేసింది. ఆర్ధిక సర్వే లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా పెరుగుదలతో, సగటు వ్యవసాయ భూమి 1.08 ఎకరాలకు పడిపోయింది. కేవలం ఒక్క ఎకరా భూమిలో వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించడం.. సమర్ధవంతంగా జీవించడం దాదాపు అసాధ్యం.

గత బడ్జెట్ లో ఏముంది?

సుధీర్ పశ్చిమ UP ప్రాంతానికి చెందిన రైతు. సాధారణంగా ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు చాలా బాగుంటాయి. ఇక్కడ రైతులు ఏడాదికి 3 పంటలు పండిస్తారు. అటువంటిది ఇక్కడ పరిస్థితులే చాలా దారుణంగా ఉంటే, ఒడిసా, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. బడ్జెట్ వస్తోంది అంటే రైతులకు ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. బడ్జెట్ లో తమకు మేలు చేసే పథకాలు వస్తాయని ఆశిస్తారు. వ్యవసాయ రంగానికి గత 4 ఏళ్లలో బడ్జెట్‌ అనేక రెట్లు పెరిగిందని ప్రభుత్వ డేటా చెబుతోంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో పంటను MSP ద్వారా కొనుగోలు చేసింది, కానీ దాని ప్రయోజనం పొందిన రైతుల శాతాన్ని పరిశీలిస్తే, అది ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది.

2020-21లో వ్యవసాయ రంగానికి 1.42 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు.

2020-21లో వ్యవసాయానికి రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2 021-22లో ఈ సంఖ్యను 1.48 లక్షల కోట్లకు పెంచారు. రైతుల కోసం 1 డిసెంబర్ 2018 నుంచి ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. దీని కారణంగా 2019-20 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ రూ. 1.3 లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్ ప్రవేశ పెట్టినపుడు కొత్త వ్యవసాయ సంబంధిత సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెబుతారు. ఇందుకోసం 2015-16లో రూ.6000 కోట్లు కేటాయించగా, 2019-20లో రూ.8000 కోట్లు కేటాయించారు. 2021-22లో దీని కోసం రూ.8510 కోట్లు కేటాయించారు. కానీ, సుధీర్ వంటి రైతులకు ఇలాంటి సబ్సిడీ పథకాలపై ఎలా ప్రయోజనాలు పొందాలో ఇప్పటికీ తెలియడం లేదు. దాని గురించి తెలిసిన కొద్దిమంది రైతులు కూడా సంక్లిష్టమైన ప్రక్రియ కారణంగా ఈ ప్రయోజనం పొందలేకపొతున్నారు. సుధీర్ లాంటి వ్యక్తులు కేవలం సాగునీరు, విద్యుత్, డీజిల్, ఎరువులు, కూలీలు అదేవిధంగా మార్కెట్‌లో విత్తనాలు వంటి వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యక్ష ఖర్చులపై దృష్టి పెడతారు. అందుకే వారి సంపాదన పెరగదు.

సుధీర్ లాంటి చిన్నరైతుల బడ్జెట్ కల ఏమిటో ఇక్కడ మనీ9 తెలుగు వీడియోలో మీరు చూడొచ్చు..

బడ్జెట్ నుంచి ఏమి ఆశిస్తున్నారు?

బడ్జెట్‌లో రైతుల పేరు మీద చాలా డేటా చూపించారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యాన్ని నామ మాత్రంగా ప్రకటించింది. ఈ మొత్తం బడ్జెట్‌లో భాగం కాకపోతే, ఇంతగా ఎందుకు ప్రచారం చేశారన్నది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, చిన్న రైతులు ప్రభుత్వ సంస్థల నుంచి రుణం పొందడం చాలా కష్టతరమైన విషయం అని చెప్పొచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా KCC రైతులకు రుణం కోసం ఒక మంచి మార్గం. ఎవరైనా రైతు ఒకసారి దాన్ని పొందినట్లయితే, రుణం పొందడం సులభం. భారతదేశంలో మొత్తం 2.5 కోట్ల మంది రైతులకు క్రెడిట్ కార్డు ఉంది. దీని ద్వారా వ్యవసాయ రుణం 2019లో రూ. 1.6 లక్షల కోట్ల నుంచి రూ. 7.09 లక్షల కోట్లకు పెరిగిందనే వాస్తవాన్ని బట్టి దీని ప్రయోజనాన్ని మనం అంచనా వేయవచ్చు. సుధీర్‌కి తన కొడుకు వ్యవసాయం చేయడం ఇష్టం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చదువులు ఎలా కొనసాగుతాయి. నెలవారీ ఇంటి ఖర్చుల తర్వాత తన పిల్లల కోసం ఆన్‌లైన్ విద్యపై ఖర్చు చేయడానికి ఏమీ మిగలదు. తాను చాలా కష్టపడి పని చేస్తున్నానని, రికార్డు హార్వెస్టింగ్ చేస్తూ ఇప్పటికీ పేదరికం బాటలోనే ఉన్నానని సుధీర్ అంటున్నాడు. బడ్జెట్ పై తన ఆశ గురించి రైతు సుధీర్ మాట్లాడుతూ.. తాను చాలా తక్కువ మొత్తంలో పంట పండించే చిన్న రైతుననీ… ప్రభుత్వం వ్యవసాయ ఖర్చులు తగ్గేలా చేయడం లేదా పంట ధరలను పెంచడం వంటి చర్యల ద్వారా తమ నెలవారీ ఆదాయం 15,000 రూపాయలకు పెరిగేలా చేస్తుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు.

Also Read: Budget 2022: బడ్జెట్‌కు ముందు ఘుమ ఘుమలాడే హల్వా .. ఈ సంప్రదాయం ఎప్పటినుంచంటే..

కేంద్రం గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో మరో కొత్త సామాజిక భద్రతా పథకం ప్రకటించే అవకాశం..!