Budget 2022: డిజిటల్ యూనివర్సిటీలు స్థాపిస్తాం.. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తాం..
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీలను స్థాపించనున్నట్లు వెల్లడించారు...
కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీలను స్థాపించనున్నట్లు వెల్లడించారు. పీఎం విద్యలో భాగంగా ఛానళ్ల సంఖ్యను 12 నుంచి 200 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంచుతామన్నారు. విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్షన్ చేసుకుని హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.ఒక్కో తరగతి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటిని అన్ని రాష్ట్రాల్లో 1 నుండి 12 తరగతులకు ప్రాంతీయ భాషలలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
పాఠశాలలు, కళాశాలల మూసివేత కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని ఆమె తెలిపారు.రేడియో, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అన్ని భాషల్లో ఈ-కంటెంట్‌ను అభివృద్ధి చేస్తామని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. నాణ్యమైన విద్యకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఈ-కంటెంట్, ఈ-విద్యా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు. మహమ్మారి కారణంగా రెండేళ్ల విద్యారంగానికి అంతరాయం ఏర్పడిందన్నారు.
Read Also.. Budget 2022: బడ్జెట్ ప్రసంగం చిన్నదే.. కానీ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..