Budget 2021: కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మార్చిలో లాక్‌డౌన్ విధించపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని..
Budget 2021 live updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో చతికిల పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పునరుత్తేజం సాధించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మార్చిలో లాక్‌డౌన్ విధించపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని మంత్రి చెప్పారు. అత్యవసర సేవల సిబ్బంది తమ ప్రాణాలొడ్డి పనిచేశారని కొనియాడారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
◘ కరోనా వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్ల ఖర్చు.
◘ కరోనా నివారణకు ఇప్పటికే దేశంలో రెండు వ్యాక్సిన్స్ వచ్చాయి. మున్ముందు ఇంకా రాబోతున్నాయి
◘ కరోనా నేపథ్యంలో చతికిల పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను 2021-22లో మెరుగుపరుస్తాం.
◘ ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 137% పెంపు. 94000 కోట్ల నుంచి 2 లక్షల 22 వేల కోట్లకు పెంపు
◘ 7 కొత్త టెక్స్‌టైల్ పార్కులు
◘ ఆత్మనిర్భర్ భారత్ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 లక్షల కోట్లతో ప్రత్యేక నిధి. ఎంపిక చేసిన 13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహకాలు.
◘ వాటర్ లైఫ్ మిషన్ కోసం 2.87 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు..
◘ అమల్లోకి స్క్రాపింగ్ విధానం- పాత వాహనాలను తొలగించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు.. వ్యక్తిగత వాహనాలు 20 సంవత్సరాల తరువాత, వాణిజ్య వాహనాలపై 15 సంవత్సరాల తరువాత నిషేధం.
◘ 17000 గ్రామీణ 11000 పట్టణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి: సీతారామన్
◘ ఈ దశాబ్దానికి ఇదే మెరుగైన మొదటి బడ్జెట్. ఆర్థిక వ్యవస్థ చరిత్రలో 3సార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉంది. 2021 సంవత్సరం భారతదేశ చరిత్రలో అనేక మైలురాయిగా నిలుస్తుంంది.
◘ పేదల సంక్షేమ పథకం, పిఎమ్‌కెకెవై పథకాన్ని ప్రభుత్వం లాక్‌డౌన్‌లో తీసుకువచ్చింది. దీనివల్ల 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాం.
◘ ప్రస్తుతం, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి తమ దేశవాసులే కాకుండా 100కు పైగా దేశాలకు భారతదేశం సహాయం చేస్తోంది.
◘ వందల ఏళ్ల క్రిందటే మనం స్వయం సమృద్ధి సాధించాం.
◘ ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది.
◘ ఆత్మనిర్భర్ ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడాయి.
◘ గతేడాది మే నెలలో 5 మినీ బడ్జెట్ వంటి ప్యాకేజీలను ప్రభుత్వం ఇచ్చింది.
◘ స్వయం సమృద్ధి ప్యాకేజీ జిడిపిలో 13 శాతం
◘ కరోనా నేపథ్యంలో 27.1 లక్షల కోట్ల రూపాయల ఉపశమన ప్యాకేజీ ఇచ్చాం.
Also Read: