వైసీపీదే విజయం- వాసిరెడ్డి పద్మ
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్ చూస్తే..ఫ్యాన్ గాలి స్పీడ్ తెలుస్తుందని చెప్పారు. ‘టీవీ 9’ నిర్వహించే ‘బిగ్ న్యూస్..బిగ్ డిబేట్’లో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న భావనకి ప్రజలు వచ్చారని…చంద్రబాబు గారి పథకాల జిమ్మిక్కులను జనం నమ్మలేదని చెప్పారు. పోలింగ్‌కు ముందు ప్రజల తీర్పుపై […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్ చూస్తే..ఫ్యాన్ గాలి స్పీడ్ తెలుస్తుందని చెప్పారు. ‘టీవీ 9’ నిర్వహించే ‘బిగ్ న్యూస్..బిగ్ డిబేట్’లో ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న భావనకి ప్రజలు వచ్చారని…చంద్రబాబు గారి పథకాల జిమ్మిక్కులను జనం నమ్మలేదని చెప్పారు. పోలింగ్‌కు ముందు ప్రజల తీర్పుపై కాస్త అనుమానాలున్నా…ఓటింగ్ ముగిసాక జనం ఎవరివైపు నిలబడబోతున్నారో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ లాంటి నేతను..ప్రజలు వెంటబడి తరిమే స్థాయికి వచ్చారంటేనే సీన్ ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చని పద్మ వ్యాఖ్యానించారు. చాలా ఘోరమైన ఓటమి తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు.