మోదీ దృష్టంతా ప్రచారం పైనే- మమత
డార్జిలింగ్: ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు దాడిని పెంచారు. తనను తాను ప్రచారం చేసుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆయన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డార్జిలింగ్‌లోని చౌక్‌బజార్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. మోదీ తన జీవిత చరిత్రపై సినిమాలు తీసుకునేంత గొప్ప నేత అయిపోయారని ఎద్దేవా చేశారు. నమో పేరిట దుకాణాలు ఏర్పాటు చేసి […]
డార్జిలింగ్: ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు దాడిని పెంచారు. తనను తాను ప్రచారం చేసుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆయన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డార్జిలింగ్‌లోని చౌక్‌బజార్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. మోదీ తన జీవిత చరిత్రపై సినిమాలు తీసుకునేంత గొప్ప నేత అయిపోయారని ఎద్దేవా చేశారు. నమో పేరిట దుకాణాలు ఏర్పాటు చేసి నమో దుస్తులను విక్రయిస్తున్నారని అన్నారు. తనను తాను ప్రచారం చేసుకోవడానికి మోదీ ఎక్కువ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. భారత్‌లో స్వాతంత్య్రం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని మమతా అన్నారు. బీజేపీ పాలనలో గాంధీజీ, నేతాజీ, వివేకానందలాంటి వారి ఆదర్శాలను కూడా ప్రజలు మర్చిపోయేలా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.