దొంగనోట్లు ముద్రించిన మహిళ అరెస్ట్
దొంగనోట్లు ముద్రించి కటకటాలపాలైంది ఓ మహిళ. తమిళనాడులో చిదంబరం మరియప్పనగర్‌కు చెందిన భరణీకుమారి ఎంబీఏ పూర్తిచేసి ఖాళీగా ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగా ఇరుగుపొరుగు దగ్గర అప్పులు చేసింది. డబ్బులు చెల్లించాలని వారంతా ఒత్తిడి చేయడంతో తన క్రైమ్ బుర్రకు పనిచెప్పింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగనోట్లు ముద్రించాలని ప్లాన్ వేసింది. అనుకున్నట్లుగానే తన ప్లాన్‌ను అమలుపరించింది. దాదాపు లక్ష రూపాల నకిలీ నోట్లను ముద్రించింది. కడలూరులో నకిలీ నోట్లను మార్చుతూ వస్తోంది భరణీకుమార్. కొన్నాళ్లు సాఫీగానే […]

దొంగనోట్లు ముద్రించి కటకటాలపాలైంది ఓ మహిళ. తమిళనాడులో చిదంబరం మరియప్పనగర్‌కు చెందిన భరణీకుమారి ఎంబీఏ పూర్తిచేసి ఖాళీగా ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగా ఇరుగుపొరుగు దగ్గర అప్పులు చేసింది. డబ్బులు చెల్లించాలని వారంతా ఒత్తిడి చేయడంతో తన క్రైమ్ బుర్రకు పనిచెప్పింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దొంగనోట్లు ముద్రించాలని ప్లాన్ వేసింది. అనుకున్నట్లుగానే తన ప్లాన్‌ను అమలుపరించింది. దాదాపు లక్ష రూపాల నకిలీ నోట్లను ముద్రించింది.
కడలూరులో నకిలీ నోట్లను మార్చుతూ వస్తోంది భరణీకుమార్. కొన్నాళ్లు సాఫీగానే సాగింది. అయితే తాజాగా ఓ దుకాణానికి వెళ్లిన ఆమె రెండువేల రూపాయల నకిలీ నోటును ఇచ్చింది. షాపు ఓనర్‌కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చేసరికి నిందితురాలు పరారయ్యింది. పక్కనే ఉన్న బస్టాండ్‌లో చిదంబరానికి వెళ్లే బస్సులో కూర్చుంది. పోలీసులు బస్టాండ్ అంతా జల్లెడపట్టి.. బస్సులో కూర్చున్న భరణీకుమారిని అరెస్ట్ చేశారు. విచారణలో అప్పులబాధలు భరించలేకే నకిలీనోట్లు ముద్రించినట్లు తెలిపింది. నిందితురాలి ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు ఓ ప్రింటర్‌ని, నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు.



