AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం… శ్రీవారి సన్నిధిలో భయం..భయం

తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం... శ్రీవారి సన్నిధిలో భయం..భయం
Rajesh Sharma
|

Updated on: Apr 16, 2020 | 1:28 PM

Share

Viral video of bears movement in Tirumala: తిరుమలేశుని సన్నిధిలో క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం శ్రీవారి సన్నిధి ఆనందనిలయం చెంత అడవి పందులు సంచారం చేయగా తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు యధేచ్ఛగా తిరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన రోడ్లకు అడ్డంగా ఎలుగు బంట్ల సంచరిస్తుండడం గమనించిన కొందరు ఈ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తిరుమలలో గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో భక్తుల దర్శనాలు నిరవధికంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. తొలుత వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేసి, ఓన్లీ స్వామి వారి కైంకర్యాలను మాత్రమే నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ పొడిగించినప్పుడల్లా భక్తుల దర్శనాల రద్దును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా ఈ దర్శనాల రద్దు మే 3వ తేదీ వరకు కొనసాగుతుందని టీటీడీ ప్రకటించింది.

ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల రోడ్లన్నీ ఇపుడు నిర్మానుష్యంగా మారాయి. కొండమీద నివాసముండే వారికి సైతం లాక్ డౌన్ ఆంక్షలు వుండడంతో రోడ్లమీద జన సంచారం లేకుండా పోయింది. ఈక్రమంలో సమీపంలోని చిట్టడవుల నుంచి కొన్ని జంతువులు తిరుమల వీథులకు యధేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆనందనిలయం ముందుకు పందులు రాగా.. తాజాగా తిరుమల రోడ్లపై ఎలుగు బంట్లు సంచారం చేశాయి. పాములు, ఇతర చిన్న చిన్ని జంతువుల సంచారం షరామామూలుగా మారిందని తిరుమలపై నివాసముండే వారు చెప్పుకుంటున్నారు. క్రమేపీ క్రూర జంతువుల రాక మొదలైన నేపథ్యంలో తిరుమల కొండ మీద వుండే ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.

Read this:  పోలీసు డ్యూటీకి ఎంఐఎం నేత బ్రేక్.. క్వారెంటైన్‌కు తరలించవద్దని లొల్లి