పోలీసు డ్యూటీకి ఎంఐఎం నేత బ్రేక్.. క్వారెంటైన్‌కు తరలించవద్దని లొల్లి

రాష్ట్రంలో రెడ్ జోన్లు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు అవగాహన లేని రాజకీయ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం జరిగింది.

పోలీసు డ్యూటీకి ఎంఐఎం నేత బ్రేక్.. క్వారెంటైన్‌కు తరలించవద్దని లొల్లి
Follow us

|

Updated on: Apr 16, 2020 | 1:30 PM

రాష్ట్రంలో రెడ్ జోన్లు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు అవగాహన లేని రాజకీయ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ.. వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం జరిగింది. కరోనా అనుమానితులను క్వారెంటైన్‌కు తరలిస్తున్న పోలీసులను ఎంఐఎం పార్టీకి చెందిన మునిసిపల్ డిప్యూటీ మేయర్ అడ్డుకున్న ఉదంతమిది. పైగా తాను చేస్తున్నది తన కమ్యూనిటీకి ఉపయోగపడే పని అన్నట్లుగా పోలీసులతో వాదులాటకు దిగిన డిప్యూటీ మేయర్‌ను ఏమీ చేయలేక పోలీసులు వెనుదిరిగిన పరిస్థితి ఇది.

నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశారు. నగరంలోని ఆటోనగర్‌లో కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్నాడు డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్. వైద్య సిబ్బంది, పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన ఎం.ఐ.ఎం. నేత, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్‌తో పాటు ఓ కార్పొరేటర్ భర్త సహా 10 మందిపై ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్ జోన్ ప్రాంతంగా ఉన్న ఆటో నగర్‌లో ఓ కుటుంబ సభ్యులను క్వారన్ టైన్ తరలిస్తుండగా అడ్డుకున్నా డిప్యూటీ మేయర్. అధికారుల విధులకు ఆటంకం కల్పించారన్న అభియోగంతోపాటు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు.

రెడ్ జోన్‌లో ఎవరైనా అనుమానితులంటే వారిని వెంటనే క్వారెంటైన్‌కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించగా.. దాన్ని పాటిస్తున్న అధికారులు, పోలీసులకు ఎంఐఎం నేతలు అడ్డుగా నిలిచారు. పోలీసులు పరిస్థితిని, తమకున్న ప్రభుత్వ ఆదేశాలను వివరిస్తున్నా కూడా పరుష పదజాలంతో పోలీసులను దుర్భాషలాడాడు ఎంఐఎం పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్. రోడ్డుపై హంగామా సృష్టించిన ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ప్రభుత్వం ఒకవైపు ఆదేశాలిస్తూ.. ఇలా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా చర్యలకు ఆదేశించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంఐఎం నేతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదు అన్న ధీమాతోనే ఆ పార్టీ నేతలు తరచూ పోలీసులకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కింది స్థాయిలో వినిపిస్తున్నాయి.

Read this: తిరుమలలో ఎలుగుబంట్ల సంచారం… శ్రీవారి సన్నిధిలో భయం..భయం