చైనా వస్తువులను భారత్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతోంది?

భారత్‌ను అడుగడుగునా అడ్డుకుంటున్న చైనా చైనా వస్తువులను బ్యాన్ చేయడం సాధ్యం కాదా? అసలు సమస్య WTO నిబంధనలే. చైనాపై మనం ఆ స్థాయిలో ఆధారపడ్డాం. చైనాకు వీటో పవర్ ఉంది. నిషేధం సాధ్యమే.. మన చేతుల్లోనే ఉంది.   న్యూఢిల్లీ: చైనా వస్తువులను బ్యాన్ చేయాలి. చైనా వస్తువులను వాడొద్దు. డౌన్ డౌన్ చైనా.. ఇవి ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు చోట్ల వినిపిస్తోన్న నినాదాలు, డిమాండ్‌లు. అసలు చైనా పెరెత్తితేనే అసహ్యంగా ఉందనే వారు […]

చైనా వస్తువులను భారత్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతోంది?
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:07 PM

  • భారత్‌ను అడుగడుగునా అడ్డుకుంటున్న చైనా
  • చైనా వస్తువులను బ్యాన్ చేయడం సాధ్యం కాదా?
  • అసలు సమస్య WTO నిబంధనలే.
  • చైనాపై మనం ఆ స్థాయిలో ఆధారపడ్డాం.
  • చైనాకు వీటో పవర్ ఉంది.
  • నిషేధం సాధ్యమే.. మన చేతుల్లోనే ఉంది.

న్యూఢిల్లీ: చైనా వస్తువులను బ్యాన్ చేయాలి. చైనా వస్తువులను వాడొద్దు. డౌన్ డౌన్ చైనా.. ఇవి ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు చోట్ల వినిపిస్తోన్న నినాదాలు, డిమాండ్‌లు. అసలు చైనా పెరెత్తితేనే అసహ్యంగా ఉందనే వారు కూడా రోజు రోజుకు పెరుగుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఇది బాగా ఎక్కువవుతుంది. సోషల్ మీడియాలో భారత నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

భారత్‌ను అడుగడుగునా అడ్డుకుంటున్న చైనా తాజాగా పుల్వామా దాడిలో 40కి పైగా భారత సీఆర్పిఎఫ్ జవాన్లను పొట్టొన పెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు బాస్ అయిన మసూద్ అజహర్‌ను భారత్ టార్గెట్ చేసింది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని చేసిన ప్రయత్నంలో అందరి నుంచి మద్దతు వచ్చింది. అయితే ఆ క్రమంలో చైనా మద్దతు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో చైనాను భారత్ సంప్రదించగా.. తోసిపుచ్చింది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.

నిజానికి ఈ విధంగా చైనా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. చాలా కాలంగా ఇలాంటి విషయాల్లో భారత్‌కు చైనా కంటిలో నలుసు మాదిరిగా ప్రవర్తిస్తోంది. పలు రకాలుగా అడ్డుపడుతోంది. పుల్వామా ఉగ్ర దాడి ఘటనను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటన విడుదల చేయాలనుకుంది. కానీ చైనా దాన్ని అడ్డుకుంది. ప్రకటనను రాసిన విధానం తమకు నచ్చలేదని, కొంత సమయం కావాలంటూ అడ్డుపడింది.

దీంతో ప్రకటనను వాయిదా వేశారు. ఆ ప్రకటనలో ఉగ్రవాదం అనే పదం వాడటాన్ని వ్యతిరేకించింది. భారత భూభాగంలోని కాశ్మీర్ అనడాన్ని ఒప్పుకోలేదు. భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్ అనే పదం వాడాలంటూ పుల్ల పెట్టింది. కానీ దాడి జరిగిన వారం రోజుల తర్వాత ఎట్టకేలకు చైనాను అడ్డుకుని భారత్ దౌత్య విజయం సాధించింది. భారత్ రాసి ఇచ్చిన ప్రకటననే భద్రతా మండలి విడుదల చేసింది. అమెరికా సహకరించడం వల్లే సాధ్యమైందని భారత వర్గాలు చెప్పాయి.

చైనా వస్తువులను బ్యాన్ చేయడం సాధ్యం కాదా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా రకాలుగా భారత్‌ను చైనా అంతర్జాతీయంగా అడ్డుకుంటుంది. దీంతో చైనా వైఖరి బయట పడినప్పుడల్లా భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబెకుతుంటుంది. చైనా వస్తువులను ఎందుకు బ్యాన్ చేయడం లేదనే డిమాండ్ ముందుకొస్తుంది. మరి చైనా వస్తువులను భారత్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు? అలా చేయడం సాధ్యం కాదా? అంత కష్టమా? అసలు కథ ఏమిటి? అనే ప్రశ్నలు పలువురిని తొలిచేస్తుంటాయి.

అవును చైనా వస్తువులను నిషేదించడం కష్టమే. అలా చేయడానికి సాధ్యం కాదు. ఏదో ఒక దేశంపై వ్యాపార పరంగా బ్యాన్ విధించడం అంతర్జాతీయ వ్యాపార సూత్రాల పరంగా కుదరదు. అందులోనూ చైనా వంటి అగ్ర దేశం విషయంలో మరింత కష్టం. ప్రజలు ఇష్టపడటం లేదనో, చైనా మనకు వ్యతిరేకంగా ఉంటుందనే చైనా వస్తువులను నిషేదించడం సాధ్యం కాదంటూ మన దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ వెల్లడించారు. గతంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

అసలు సమస్య WTO నిబంధనలే.. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌(WTO)’కు ఉన్న నియమ నిబంధనలే అసలు కారణం. ఈ ఆర్గనైజేషన్ 1995, జనవరి 1వ తేదీని ఏర్పడింది. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అంతర్జాతీయ వ్యాపారాన్ని సజావుగా సాగేలా చూడటమే దీని పని. ఇందుకు కొన్ని రూల్స్‌ను ఏర్పాటు చేసి సభ్య దేశాలన్నీ వాటిని పాటించేలా చూస్తుంది. ఈ క్రమంలో ఏదైనా రెండు దేశాల మధ్య గొడవలు వస్తే వాటిని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక ఫోరమ్‌ను కూడా ఇది ఏర్పాటు చేసింది. ఇందులో 164 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అందులో చైనా, భారత్‌లు కూడా ఉన్నాయి.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఉన్న నియమాల్లో ముఖ్యమైనది సభ్య దేశాల పట్ల వ్యాపార పరంగా అటంకాలు ఉండకూడదు. పరస్పరం లబ్ధి పొందేలా ప్రతి సభ్య దేశం వ్యాపారానికి అంగీకరించాలి. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చర్చించాలి. ముఖ్యంగా ఏ దేశంతో అయితే ఇబ్బంది ఉందో ఆ దేశంతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతున్న సమయంలో ఆధారాలను WTOలో చూపించి ఏదైనా డిమాండ్ చేయవచ్చు.

చైనాపై మనం ఆ స్థాయిలో ఆధారపడ్డాం.. అలా కాకుండా చైనా పట్ల ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే భారత్‌పై కూడా అంతర్జాతీయ వ్యాపార పరంగా పలు ఆంక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా చైనా వస్తువులు భారత్‌లో చాలా చోట్ల వినియోగిస్తున్నారు. సడెన్‌గా వాటిని ఆపేస్తే అది భారత్‌కే నష్టం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏడాది 65 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువగల చైనా వస్తువులు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్థాయిలో మనం చైనాపై ఆధారపడ్డాం. ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి ఆలోచనలు దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

చైనాకు వీటో పవర్ ఉంది BRICS, SCO, AIIB వంటి అంతర్జాతీయ సంస్థలకు అత్యధిక నిధులు సమకూరుస్తుంది చైనానే. వీటిలో భాగస్వామ్యంగా ఉండాలంటే చైనాతో భారత్ స్నేహంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైనాకు వీటో పవర్ ఉంది. ప్రపంచస్థాయిలో ఏ నిర్ణయం అమలు కావాలన్నా వీటో పవర్ ఉన్న ఐదే దేశాల అనుమతి తప్పనిసరి. వీటో పవర్ ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్.

నిషేధం సాధ్యమే.. మన చేతుల్లోనే ఉంది.. అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి. భారత ప్రజలు వారంతట వారే చైనా వస్తువులను కొనకూడదని నిర్ణయించుకుంటే మాత్రం దాన్ని ఎవరూ ఆపలేరు. వరల్డ్ ట్రైడ్ ఆర్గనైజేషన్ కూడా ఏమీ చేయలేదు. అప్పుడు మాత్రమే చైనా వస్తువులు భారత్‌లో అమ్ముడుపోకుండా ఉండగలవు. కాబట్టి చైనా వస్తువులపై కోపంగా ఉంటే వాటిని ప్రజలు కొనకుండా ఉండటమే మన చేతుల్లో ఉన్నది. అలా కాకుండా నిషేదించడం మాత్రం సాధ్యం కాదు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!