సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని నిర్భయ తల్లి ఆశా దేవీ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ఆమె అన్నారు.

సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలి: నిర్భయ తల్లి
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 3:21 PM

Nirbhaya Mom on Sushant case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని నిర్భయ తల్లి ఆశా దేవీ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి తన మద్దతు ఉంటుందని ఆమె అన్నారు. సుశాంత్‌ మృతిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు.

”తమకు న్యాయం జరగాలంటూ చేతులు జోడించి సుశాంత్ సోదరి అభ్యర్థిస్తుండటం చూడగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఇంతవరకు నేను సుశాంత్ కుటుంబాన్ని కలవలేదు, మాట్లాడలేదు. కానీ వారి బాధ ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే నా కుమార్తెకు న్యాయం జరగాలంటూ నేను చాలా కాలం పాటు పోరాడాను. నిజం కచ్చితంగా బయటకు వస్తుంది. కచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని సుశాంత్ సోదరికి, అతడి కుటుంబానికి చెప్పాలనుకుంటున్నా. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు, బీహార్ పోలీసులతో పాటు ఎంతోమంది మీకు మద్దతుగా ఉన్నారు. న్యాయం జరిగేందుకు కాస్త సమయం పట్టొచ్చు. కానీ గెలిచి తీరుతుంది. ముంబయి పోలీసులు కూడా వారికి సాయం చేయాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

”సుశాంత్ విషయంలో కాస్త సంయమనం పాటించాలని ఓ మంత్రి చెప్పిన మాటలను విన్నాను. కానీ కొడుకును పోగొట్టుకున్న ఎవరూ అలా ఉండలేరు. ఆ వృద్ధ తండ్రి బాధ వర్ణానాతీతం. సుశాంత్‌ మరణించి రెండు నెలలు అవుతున్నా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. అలాంటప్పుడు ఆ తండ్రిని ప్రశాంతంగా ఎలా ఉండమంటారు. జీవితంలో కుమారుడిని పోగొట్టుకున్న వారు ప్రశాంతంగా ఉండలేరు. సుశాంత్ కేసు విషయంలో న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా” అని ఆశా దేవీ వెల్లడించారు.

Read More:

నా సర్వస్వం నువ్వే.. ఐ లవ్‌ యు: మిహీక

మారని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు.. 22 రోజులకు 20లక్షల బిల్లు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు