బాబు హెచ్చరించిన మర్నాడే మరో 2 కేసులు

ఇప్పటికే ఏపీలో ఉప్పు, నిప్పులా మారిన టిడిపి, వైసీపీ నేతల, వారి వర్గాల మధ్య రగడ మరింత ముదురుతోంది. పలువురు టిడిపి నేతలిప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని బెయిళ్ళ కోసం తిప్పలు పడుతుండగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ నగరానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్ లిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల […]

బాబు హెచ్చరించిన మర్నాడే మరో 2 కేసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 11, 2019 | 3:53 PM

ఇప్పటికే ఏపీలో ఉప్పు, నిప్పులా మారిన టిడిపి, వైసీపీ నేతల, వారి వర్గాల మధ్య రగడ మరింత ముదురుతోంది. పలువురు టిడిపి నేతలిప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుని బెయిళ్ళ కోసం తిప్పలు పడుతుండగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ నగరానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్ లిద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో ర్యాలీ నిర్వహించారన్నది వారిపై మోపిన అభియోగం.

తమ పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ నగరానికి వచ్చిన సందర్భంలో ఎలాంటి అనుమతి లేకుండా వారిద్దరు స్వాగత ర్యాలీలో నిర్వహించడమే వీరి నేరమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు వెళ్ళిన పోలీసులపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో సివిల్ పోలీసులు ఈ మేరకు కేసులు నమోదు చేశారు.

గురువారం విశాఖ పర్యటనకొచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు తమ పార్టీ శ్రేణులపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసులు ఓవరాక్షన్ మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ఈ మేరకు హెచ్చరిక చేసిన 24 గంటల్లోనే పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం విశేషం.