బ్యాంకులకు మాల్యా మరో ఆఫర్
మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు...

Vijay Mallya Offers Settlement Package : మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలను అమలు చేస్తూనే తప్పించుకుంటున్నాడు లిక్కర్ డాన్.
అయితే విజయ్ మాల్యా నుంచి తాజాగా కొత్త ప్రతిపాదన వచ్చింది. మొత్తం పదిహేడు బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలను చెల్లించేందుకు సిద్దమేనని అని ప్రకటించాడు. అయితే.. ఓ షరతు అంటు మెలిక పెట్టాడు. తాను కట్టాలస్సిన మొత్తంను చెల్లించేందుకు సెటిల్‌మెంట్ ఆఫర్ మొత్తంలో కేవలం 13,960 కోట్లను చెల్లిస్తానని తెలిపాడు.
గత నెలలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రూ .13,960 కోట్ల పరిష్కారం లభించింది. ప్రతిసారి ఏదో ఒక ఆఫర్ చూపించి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాల్యాను ఉద్దేశించి అన్నారు. మాల్యా భారత దేశంకు రాకముందే మొత్తం డబ్బులను జమ చేయాలని మాల్యా తరఫు న్యాయవాదిని ఆయన ఆదేశించారు.




