విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

కాంగ్రెస్ నేతలకు సుప్రింకోర్టులో ఎదురుగదెబ్బ తగిలింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్‌ 29న అనుమతిచ్చింది. హైకోర్టుతీర్పును సవాల్‌ చేస్తూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 2:37 PM

కాంగ్రెస్ నేతలకు సుప్రింకోర్టులో ఎదురుగదెబ్బ తగిలింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్‌ 29న అనుమతిచ్చింది. హైకోర్టుతీర్పును సవాల్‌ చేస్తూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

పాత సచివాలయ భవనాల కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాల నిర్మాణంపై నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని, ఆర్టికల్‌ 136 ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతో పాటు మరో న్యాయవాది ఉదయ్‌కుమార్‌ సాగర్‌ వాదనలు వినిపించారు. విచారణకంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించింది. జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Latest Articles
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్