వర్చువల్ క్లాస్‌లో సానియా స్పీచ్

ఓ క్రీడాకారిణిగా, తల్లిగా తన అనుభవాలను అంతర్జాతీయ అథ్లెట్లతో కలసి పంచుకున్నారు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈనెల 24న జరగనున్న 'సమ్మర్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఒలింపియన్‌, పారా ఒలింపియన్‌..

వర్చువల్ క్లాస్‌లో సానియా స్పీచ్
Follow us

|

Updated on: Jul 17, 2020 | 3:08 PM

Sania Mirza to hold Training Sessions Virtual : ఓ క్రీడాకారిణిగా, తల్లిగా తన అనుభవాలను అంతర్జాతీయ అథ్లెట్లతో కలసి పంచుకున్నారు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఈనెల 24న జరగనున్న ‘సమ్మర్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఒలింపియన్‌, పారా ఒలింపియన్‌ ఆన్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌’ లో హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా పాల్గొననున్నారు. ఇందులో ఈనెల 28న శారీరక, మానసిక ఆరోగ్యం అనే అంశంపై సానియా మీర్జా ఉపన్యసించనున్నారు. తన శిక్షణ అనుభవాలను క్రీడాకారులకు వివరించనున్నారు. తన మాటలతో వారిలో కొత్త స్ఫూర్తి నింపనున్నట్టు మీర్జా తెలిపారు.

ఈ  కార్యక్రమాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (IOC), అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. మొత్తం ఐదు రోజులపాటు ఈ ఆన్‌లైన్‌ సమావేశం జరగనున్నాయి. ఒలింపిక్స్ వాయిదా పడినా.. క్రీడాకారుల్లో ఆ స్ఫూర్తిని నింపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.  ఇక.. సింగిల్స్‌లో రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత నవోమి ఒసాకా, బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ హచిమురా, స్టార్‌ అథ్లెట్లు కొలిన్‌ జాక్సన్‌, అలీసన్‌ ఫెలిక్స్‌  కూడా ఈ ఆన్‌లైన్‌ సెషన్‌లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒలింపిక్ తన‌ యూట్యూబ్‌ చానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు.