టిక్‌టాక్‌ను మళ్లీ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.!

టిక్‌టాక్‌ యాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఒకవేళ దాన్ని డౌన్‌లోడ్‌ చేస్తే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లు అవుతుందని సైబర్ నిపుణులు అంటున్నారు.

  • Ravi Kiran
  • Publish Date - 2:59 pm, Fri, 17 July 20
టిక్‌టాక్‌ను మళ్లీ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.!

Tik Tok Cyber Attack: టిక్‌టాక్‌ యాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఒకవేళ దాన్ని డౌన్‌లోడ్‌ చేస్తే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది. చైనాకు చెందిన ఈ టిక్‌టాక్‌ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది అనధికారికంగా, స్పామ్ లింకుల ద్వారా టిక్‌టాక్‌ APK ఫైల్‌ను తమ మొబైల్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివారికి సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. త్వరలోనే సైబర్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.

‘సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో రెండు పద్దతుల్లో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. మొదటిది గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. రెండోది థర్డ్ పార్టీ సైట్ నుంచి APK ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. సరిగ్గా ఇలానే టిక్‌టాక్‌ యాప్ విషయంలోనూ పలు లింకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటి ద్వారా మీరు APK ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మాల్‌వేర్‌ కూడా మీ ఫోన్‌లోకి చొరబడుతుంది. పలు పర్మిషన్లు కూడా ఇవ్వడంతో మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ వెంకట్ రామన్ పేర్కొన్నారు.