తెలంగాణలో రేపే ముహూర్తం.. ఇక ‘ఆ’ రిజిస్ట్రేషన్లూ షురూ

తెలంగాణలో రేపే ముహూర్తం.. ఇక ‘ఆ’ రిజిస్ట్రేషన్లూ షురూ

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించినా సడలించిన కొన్నింటితో నార్మల్ లైఫ్ క్రమంగా అమల్లోకి వస్తోంది. మద్యం విక్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే దాదాపు నార్మల్ లైఫ్ స్టార్ట్ అయినట్లుగా రోడ్ల మీదికి జనం వచ్చేస్తున్నారు.

Rajesh Sharma

| Edited By: Anil kumar poka

May 07, 2020 | 6:12 PM

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించినా సడలించిన కొన్నింటితో నార్మల్ లైఫ్ క్రమంగా అమల్లోకి వస్తోంది. మద్యం విక్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే దాదాపు నార్మల్ లైఫ్ స్టార్ట్ అయినట్లుగా రోడ్ల మీదికి జనం వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి మరో ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దాంతో మరిన్ని వాహనాలు రెడ్డెక్కే సంకేతాలు స్పష్టంగా కపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కీలకం కాబోతోంది.

దాదాపు నెలన్నరగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో శుక్రవారం (మే 8వ తేదీ) నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్లో స్లాట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య గురువారం సాయంత్రానికి భారీగా పెరిగింది. ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏలో రిజిస్ట్రేషన్లకే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1640 స్లాట్స్ బుక్ అయ్యాయి. వీరంతా శుక్రవారం అందుబాటులో వున్న వాహనాల రిజిస్ట్రేషన్ స్లాట్లను బుక్ చేసుకున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి స్లాట్స్ బుక్ చేసుకున్నవారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల విస్తీర్ణం బట్టి బుకింగ్ దారులకు కాల్ లెటర్స్ జారీ చేస్తున్నారు. పూర్తి భౌతిక దూరంతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu