షాకింగ్ న్యూస్ః విశాఖ‌లో లీకైన గ్యాస్‌తో ఆక‌స్మిక మ‌ర‌ణాలు !

విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం తెల్ల‌వారు జామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకైంది.

షాకింగ్ న్యూస్ః విశాఖ‌లో లీకైన గ్యాస్‌తో ఆక‌స్మిక మ‌ర‌ణాలు !
Follow us

|

Updated on: May 08, 2020 | 7:14 AM

విశాఖ‌లో లీకైన స్టైరిన్ గ్యాస్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాధితులు కోలుకునేందుకు 48 గంట‌లు ప‌డుతుంద‌ని అప్ప‌టికీ పూర్తిగా ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్ప‌లేమ‌ని తెలిపారు. బాధితుల‌కు ప్ర‌త్యేక చికిత్స ఏం లేద‌ని అన్నారు. ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి ట్రీట్మెంట్ చేస్తార‌ని తెలిపారు. ఆక్సిజ‌న్ అందించాల్సి ఉంటుంద‌ని, కోలుకున్న ప‌ది రోజుల్లో మ‌ద్యం, సిగ‌రేట్ తాగితే ఆక‌స్మిక మ‌ర‌ణాలు సంభ‌వించే ఛాన్స్ ఉంద‌ని హెచ్చ‌రించారు.

విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం తెల్ల‌వారు జామున  3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకైంది. స్థానికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. అందరికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దద్దుర్లు, కళ్లల్లో మంటలు మొదలయ్యాయి. కడుపులో వికారం మొదలై.. వాంతులు చేసుకున్నారు. చిమ్మ చీకట్లో ఏం జరుగుతోందో తెలీక ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓపిక ఉన్నంత వరకూ పరిగెత్తిన వారు చివరికి శ్వాస అందక ఎక్కడివారక్కడే కూలబడిపోయారు. రోడ్లు, వీధులు.. ప్రజల రోదనలతో మిన్నంటాయి. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. వంద‌ల సంఖ్య‌లో బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. ఇంకా రెస్క్యూ కొన‌సాగుతోంది.