రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వ‌ల‌స‌కూలీల‌పై దూసుకెళ్లిన రైలు ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

  • Jyothi Gadda
  • Publish Date - 10:10 am, Fri, 8 May 20
రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
వ‌ల‌స‌కూలీల‌పై దూసుకెళ్లిన రైలు ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీల‌పై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్ల‌టం విచార‌క‌ర‌మ‌న్నారు. జ‌రిగిన ప్ర‌మాదంపై ప్ర‌ధాని ట్విట్ట‌ర్  వేదిక‌గా స్పందించారు. ఇలా జరగడం అత్యంత విచార‌క‌ర‌మ‌ని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై, అక్కడి పరిస్థితులపై మంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సాధ్యమైనంత మేర, అవసరమైనంత వరకు సాయం చేస్తామని ప్రధాని మోదీ ట్వీట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్‌లో ట్రాక్‌పై నిద్రపోతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో 19 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.