రైలు ఆపే ప్ర‌య‌త్నం జ‌రిగిందిః ఔరంగాబాద్ ఘటనపై రైల్వే శాఖ‌

ప్ర‌మాదం రైల్వే శాఖ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. బ‌డ్నాపూర్‌, క‌ర్మ‌ద్ రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య‌లో ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ..

రైలు ఆపే ప్ర‌య‌త్నం జ‌రిగిందిః ఔరంగాబాద్ ఘటనపై రైల్వే శాఖ‌
Follow us

|

Updated on: May 08, 2020 | 12:09 PM

మ‌హారాష్ట్ర‌లోని ఔరంగ‌బాద్‌లో జ‌రిగిన రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రైల్వే శాఖ స్పందించింది. జ‌రిగిన ఘోరంపై అధికారులు విచార‌ణ వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదం రైల్వే శాఖ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. బ‌డ్నాపూర్‌, క‌ర్మ‌ద్ రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య‌లో ప్ర‌మాదం జ‌రిగింద‌ని, శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపింది. ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలను గమనించిన లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించాడని చెప్పింది. అయితే అత‌డు చేసిన  ప్రయత్నం ఫ‌లించ‌లేద‌ని, క్ష‌ణాల్లోనే ప్ర‌మాదం జ‌రిగిపోయింద‌ని రైల్వే శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పర్బాని-మన్మాడ్ సెక్షన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. క్షతగాత్రులను ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.