ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటన విచారకరం: వెంకయ్య నాయుడు

ఔరంగ‌బాద్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా వెంక‌య్య‌నాయుడు త‌న స్పందిస్తూ…‘‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారక‌ర‌మ‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్ష‌తగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస […]

ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటన విచారకరం: వెంకయ్య నాయుడు
Follow us

|

Updated on: May 08, 2020 | 9:32 AM

ఔరంగ‌బాద్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా వెంక‌య్య‌నాయుడు త‌న స్పందిస్తూ…‘‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారక‌ర‌మ‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్ష‌తగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కర్మాడ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్‌రైలు రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటినా ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి.