కరోనా కేసుల పట్ల కేంద్ర అప్రమత్తంగా ఉంది.. మరిన్ని కోవిడ్ స్పెసిఫిక్ ఆసుపత్రులు పెంచుతున్నా్ంః హర్ష వర్ధన్
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ వెల్లడించారు.
Minister Harsh vardhan: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ వెల్లడించారు. కరోనా బాధితుల కోసం దేశవ్యాప్తంగా మొత్తం 2,084 కోవిడ్ స్పెసిఫిక్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ 19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, దేశంలో కోవిడ్ 19 పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేల క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ 19 తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఫర్టిలిటీ రేటు 1.18 శాతం, కోవిడ్ 19 ఐసీయూ రేటు కూడా 1.75 శాతం ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా బారినపడి వైద్యం తీసుకుంటున్న బాధితుల్లో 0.40 శాతం వెంటిలేటర్ సపోర్ట్, 4.03 శాతం ఆక్సీజన్ సపోర్ట్ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో దేశంలో వైద్యరంగ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది సుమారు 80 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని హర్ష వర్ధన్ చెప్పారు.
Last year, over 80% people were treated under home isolation. Our start is good but we need to increase our facilities more. We’re creating more temporary beds in hospitals. We are also working on increasing the manpower: Union Health Minister Dr Harsh Vardhan pic.twitter.com/SUghF6dwMB
— ANI (@ANI) April 20, 2021
గడిచిన మూడు నుంచి నాలుగు రోజుల్లో 800లకు పైగా నాన్ ఐసీయూ బెడ్లను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశామన్న మంత్రి.. దీనిని మరింత పెంచుతామన్నారు. ఢిల్లీలో డీఆర్‌డీఓ, సీఎస్ఐఆర్ బెడ్లను సమకూర్చాయని వెల్లడించారు. ఎయిమ్స్, సఫ్దార్‌గంజ్ ప్రాంతాల్లో మరిన్ని బెడ్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హర్ష వర్ధన్ అన్నారు. ఇక రెమిడివిసర్ ధరలను ప్రభుత్వం పరిమితం చేసింది. రెమిడివసర్ సూది మందుల లభ్యత, స్థోమతలను పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. కోవిడ్‌తో భయాందోళనలకు గురికావల్సిన పనిలేదన్నారు.