ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీకి బిగ్ షాక్
ఈటానగర్ : రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన బీజేపీకి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతో పాటుగా అసెంబ్లీకి కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి 8మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాచేసి విపక్ష నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరిపోయారు. అరవై అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని […]
ఈటానగర్ : రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన బీజేపీకి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతో పాటుగా అసెంబ్లీకి కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి 8మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాచేసి విపక్ష నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరిపోయారు. అరవై అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను అధిష్ఠానం పక్కనపెట్టింది. ఇలా టికెట్లు రానివారు మొత్తం 8 మంది ఉండగా అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం. అయితే అధిష్ఠానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేని వీరంతా తిరుగుబాటు చేశారు. మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్‌పీపీలో చేరిపోయి బీజేపీ అధిష్ఠానానికి గట్టి షాక్ ఇచ్చారు.
రాజీనామా చేసిన వారిలో హోంమంత్రి కుమార్ వైయి, పర్యాటక శాఖ మంత్రి జర్కర్,జర్‌పురం, మాజీ బీజేపీ ప్రధాన కార్యదర్శి జర్పుమ్ గాంలిన్ ఉన్నారు. వీరంతా మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రా సంగ్మాలోని నేషనల్ పీపుల్స్ పార్టీ ( ఎన్‌సీపీ) లో చేరారు. తప్పుడు సిద్ధాంతాలు, అబద్దాలతో పూర్వ వైభవాన్ని బీజేపీ కోల్పోయిందని, ముఖ్యంగా మైనారిటీలకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి కుమార్ వైయి అన్నారు. ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకుదారి తీసిందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడమేకాదు.. ఎన్‌పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్ని ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ పరిణామంపై ఎన్‌పీపీ సంతోషం వ్యక్తం చేసింది. ఎన్‌పీపీ ప్రధాన కార్యదర్శి, అరుణాచల్ ప్రదేశ్ ఇన్ చార్జ్ థామస్ సంగ్మా మాట్లాడుతూ 60 మంది సభ్యుల అసెంబ్లీలో కనీసం 30-40 సీట్లను గెల్చుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశా