AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుమ్మలకేమైంది ? ఉన్నట్లుండి దూకుడెందుకు ?

మొన్నటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కామ్ గా ఉన్న ఆ నేత స్పీడ్ పెంచడం వెనుక కారణం ఏమిటి? ఆయనకు కీలక పదవి ఏమైనా రాబోతుందా? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సీనియర్‌ నేతల రాజ్యం నడిస్తే….ఇప్పుడు జూనియర్ల సీజన్‌ మొదలైంది. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ శకం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అయితే మూడు […]

తుమ్మలకేమైంది ? ఉన్నట్లుండి దూకుడెందుకు ?
Rajesh Sharma
|

Updated on: Oct 30, 2019 | 7:55 PM

Share
మొన్నటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ సడెన్‌గా ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిన్నటి వరకు కామ్ గా ఉన్న ఆ నేత స్పీడ్ పెంచడం వెనుక కారణం ఏమిటి? ఆయనకు కీలక పదవి ఏమైనా రాబోతుందా? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు సీనియర్‌ నేతల రాజ్యం నడిస్తే….ఇప్పుడు జూనియర్ల సీజన్‌ మొదలైంది.
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ శకం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అయితే మూడు దశబ్దాల పాటు రాజకీయాల్లో కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పుడు యాక్టివ్‌ అయ్యారు. ఈయన సడెన్‌గా ఖమ్మం పొలిటికల్‌ స్కీన్‌పైకి రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.
సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల…పలుసార్లు మంత్రిగా పనిచేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఇటీవల ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత  కార్యకర్తలకు దూరం అయ్యారు. నియోజకవర్గాన్ని వదిలివేశారు.  ఇదే టైమ్‌లో పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఇక పాలేరు వైపు తుమ్మల కన్నెత్తి చూడలేదు. సభ్యత్వ సేకరణ సమయంలో మాత్రమే వచ్చి పోయారు. అడపా దడపా చిన్న చిన్న ప్రొగ్రామ్ లకు మాత్రమే వచ్చి పోయేవారు.  
ఇన్నాళ్లు పాలేరుకు దూరంగా ఉన్న తుమ్మల…లేటెస్ట్‌గా మళ్లీ యాక్టివ్‌ అయ్యారు.  పదిహేను రోజులుగా తుమ్మల నాగేశ్వర రావు నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు.  ఒక్కసారిగా తుమ్మల యాక్టివ్ ఎందుకు అయ్యారు అనే చర్చ మొదలైంది.
ఓటమి తర్వాత తుమ్మల దూకుడు తగ్గించారు. అయితే మంత్రి పదవి వస్తుందని అనుచరవర్గం మాత్రం ఊహలోకాల్లో విహరించింది. కానీ ఆ మంత్రి పదవి కెటిఆర్ ముఖ్య అనుచరుడు అయిన పువ్వాడ  అజయ్ ను వరించింది. అయితే పువ్వాడ మంత్రి అయిన తర్వాత  తుమ్మల మళ్లీ యాక్టివ్‌ కావడం నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.  అయితే నిన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆయన అనుచర వర్గం కూడ కొంత మేరకు దెబ్బ తింది. ఊగిసలాటలో ఉండిపోయింది. అయితే ఇప్పుడు తుమ్మల యాక్టివ్ గా నియోజకవర్గంలో పర్యటిస్తు ఉండడంతో మళ్లీ ఆయన వద్దకు క్యాడర్ తరలి వెళుతున్న పరిస్థితి ఉంది.
మరి ఇప్పటికే కందాల ఎంఎల్ఎ గా అటు టిఆర్ఎస్ వర్గాలను, ఇటు కాంగ్రెస్ వర్గాలను కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను అందరి వాడినని, తనకు వర్గ విబేధాలు లేవని చెబుతు కందాల తన రోల్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కందాల తిరుగుతుండగా, ఇటు కర్మలు, పార్టీ నాయకుల వద్దకు వెళుతూ తుమ్మల కూడ యాక్టివ్ అయ్యారు. అయితే తుమ్మల యాక్టివ్‌ పాలిటిక్స్‌తో ఏం సిగ్నల్స్‌ పంపుతున్నారనే చర్చ నడుస్తోంది.